iDreamPost

విక్రమ్ సినిమాలో ఎవరికెంత పారితోషికం?? కమల్‌కి అంతేనా??

విక్రమ్ సినిమాలో ఎవరికెంత పారితోషికం?? కమల్‌కి అంతేనా??

లోకనాయకుడు కమల్‌ హాసన్‌, స్టార్ హీరోలు విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ ముఖ్యపాత్రల్లో, సూర్య గెస్ట్ గా తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా విక్రమ్. తమిళ యువ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో హీరో నితిన్‌, ఆయన తండ్రి రిలీజ్ చేస్తున్నారు. జూన్‌ 3న తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ పాన్ ఇండియా సినిమాగా విక్రమ్ విడుదల అవ్వనుంది. ఇప్పటికే విక్రమ్ ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తున్నారు.

తాజాగా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఇంతమంది స్టార్స్ ఉండగా ఎవరికెంత పారితోషికం ఇచ్చారనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ సినిమాని కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ పై నిర్మించారు. తమిళ సినిమీడియా వార్తల ప్రకారం ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లు కాగా కమల్‌ హాసన్‌ 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడట. అయితే ఆయనే నిర్మాత కావడంతో వచ్చే లాభాల్లో వాటా తీసుకోనున్నారు. అందుకే ఆయన రెమ్యునరేషన్ ని తగ్గించుకున్నట్టు తెలుస్తుంది.

ఇక డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ దాదాపు రూ.5 కోట్లు అందుకున్నట్లు సమాచారం. స్టార్ హీరో విజయ్‌ సేతుపతి రూ.5 కోట్లు, ఫహద్‌ ఫాజిల్‌ రూ.4 కోట్ల మేర పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేసిన అనిరుధ్‌ రవిచందర్‌కు కూడా దాదాపు రూ.3 కోట్లు ఇచ్చారంట. అయితే ఈ సినిమా దాదాపు 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. కమల్ నాలుగేళ్ల తర్వాత తెరపై కనపడుతుండటం, ఒకే సినిమాలో ఇంతమంది స్టార్ హీరోలు ఉండటంతో విక్రమ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి