iDreamPost
android-app
ios-app

Suriya 44 Glimpse: బర్త్ డే సర్ప్రైజ్.. ‘రోలెక్స్’ పాత్రను గుర్తుచేసిన సూర్య!

  • Published Jul 23, 2024 | 9:58 AM Updated Updated Jul 23, 2024 | 9:58 AM

Suriya 44 Movie Glimpses: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా 'సూర్య 44' మూవీ గ్లింప్స్ ను విడుదల చేశారు. డాన్ పాత్రలో రోలెక్స్ ను మరోసారి గుర్తు చేశాడు సూర్య.

Suriya 44 Movie Glimpses: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా 'సూర్య 44' మూవీ గ్లింప్స్ ను విడుదల చేశారు. డాన్ పాత్రలో రోలెక్స్ ను మరోసారి గుర్తు చేశాడు సూర్య.

  • Published Jul 23, 2024 | 9:58 AMUpdated Jul 23, 2024 | 9:58 AM
Suriya 44 Glimpse: బర్త్ డే సర్ప్రైజ్.. ‘రోలెక్స్’ పాత్రను గుర్తుచేసిన సూర్య!

హీరో, హీరోయిన్ల బర్త్ డే సందర్భంగా వారి లేటెస్ట్ మూవీలకు సంబంధించిన స్పెషల్ అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు మేకర్స్. ఆ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ లాంటివి రిలీజ్ చేస్తుంటారు. తాజాగా మంగళవారం(జూలై23) కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ‘సూర్య 44’ మూవీ గ్లింప్స్ ను విడుదల చేశారు. డాన్ పాత్రలో రోలెక్స్ ను మరోసారి గుర్తు చేశాడు సూర్య.

సూర్య-కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సూర్య 44 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం రూపొందుతున్న ఈ మూవీ గ్లింప్స్ ను సూర్య బర్త్ డే సందర్భంగా మంగళవారం విడుదల చేశారు. లవ్, లాఫర్, వార్.. ద వన్ అనే ట్యాగ్ లైన్ తో రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇందులో సూర్య డాన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పక్కా గ్యాంగ్ స్టర్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ మూవీ బాషా రేంజ్ లో సూర్య కనిపించి సర్ప్రైజ్ చేశాడు. రోలెక్స్ పాత్ర టచ్ కూడా ఇందులో కనిపించింది. సూర్య పాత్ర గురించి ఎక్కువగా రివీల్ చేయకుండా మేకర్స్ గ్లింప్స్ వదిలారు.

ఇక ఈ మూవీలో సూర్య సరసన పూజ హెగ్డే నటిస్తోంది. జ్యోతిక-సూర్యలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జోజు జార్జ్, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం నటిస్తున్న ‘కంగువ’ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది.  డైరెక్టర్ శివ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ మూవీలో సూర్య ఆరు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తాడని సమాచారం. మరి సూర్య 44 గ్లింప్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet