iDreamPost
android-app
ios-app

‘కలి’ కమల్ కాదు.. మరి ఎవరై ఉంటారు? ప్రొడక్షన్ డిజైనర్ చెప్పిన నిజాలు!

  • Published Jul 21, 2024 | 3:56 PM Updated Updated Jul 21, 2024 | 3:56 PM

Kalki 2898 AD: కల్కి చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన నితిన్ జిహనీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కల్కి సీక్వెల్ గురించి సంచలన నిజాలు వెల్లడించాడు. అతడి చెప్పిన విషయాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ వివరాల్లోకి వెళితే..

Kalki 2898 AD: కల్కి చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన నితిన్ జిహనీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కల్కి సీక్వెల్ గురించి సంచలన నిజాలు వెల్లడించాడు. అతడి చెప్పిన విషయాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 21, 2024 | 3:56 PMUpdated Jul 21, 2024 | 3:56 PM
‘కలి’ కమల్ కాదు.. మరి ఎవరై ఉంటారు? ప్రొడక్షన్ డిజైనర్ చెప్పిన నిజాలు!

‘కల్కి 2898 AD’.. సినిమా విడుదలై దాదాపు నెల రోజులు కావొస్తున్నప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర దాని ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రం రెండు వారాల్లోనే రూ. 1000 కోట్లను వసూళ్ చేసి.. ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పటికీ ఆ జోరు అలాగే కొనసాగిస్తోంది. ఓవర్సీస్ లో అయితే రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతూ దూసుకెళ్తున్నాడు డార్లింగ్. ఈ క్రమంలో కల్కి చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన నితిన్ జిహనీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కల్కి సీక్వెల్ గురించి సంచలన నిజాలు వెల్లడించాడు. అతడి చెప్పిన విషయాలు వింటే నాగ్ అశ్విన్ విజన్ కు మీరు హ్యాట్సాప్ అనకమానరు.

కల్కి సినిమా చూసిన చాలా మంది ‘కలి’ పాత్రాధారి కమల్ హాసన్ అనుకున్నారు. కానీ కాదట. అదీకాక కల్కిలో చూపించింది కేవలం ఒకే ‘కాంప్లెక్స్’. కానీ ప్రపంచంలో వేర్వేరు చోట్ల ఏడు కాంప్లెక్స్ ఉంటాయని, వాటన్నింటికీ.. సుప్రీమ్ యాస్కిన్ నాయకుడు. ఇక్కడి వరకు ఒకే. కానీ కల్కి చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన నితిన్ జిహాని చెప్పిన విషయాలు వింటే మీరు కంగుతింటారు. నాగ్ అశ్విన్ ఇంకా ఇంత కథను దాచాడా? అతడి విజన్ వేరే లెవల్ అంటారు. నితిన్ జిహాని ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

“ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఏడు కాంప్లెక్స్ ఉంటాయి. మీరు కల్కిలో చూసింది ఒకే ఒక్క కాంప్లెక్స్. వీటికి సుప్రీమ్ యాస్కిన్ నాయకుడు. కానీ అతడు కంటికి కనిపించని ఓ శక్తి కింద పనిచేస్తుంటాడు. ఆ శక్తి ఏంటి? అనేది మీరు తెరపైనే చూడాలి” అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు నితిన్ జిహాని. అంటే కలి కమల్ కాదని చెప్పకనే చెప్పాడు. దాంతో కలి ఎవరు? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. కలి, సుప్రీమ్ యాస్కిన్ వేర్వేరు అని క్లారిటీ వచ్చేసింది. అయితే కలి ఎవరు? ఆ పాత్రను ఎవరితో చేయిస్తున్నారు అంటూ అభిమానుల్లో ఆసక్తిరేకెత్తించేలా చేశాడు నితిన్. ఇక కలి పాత్రను ఏ హీరోతో చేయిస్తున్నారో? అని ఆలోచించడం మెుదలుపెట్టారు ఫ్యాన్స్. ఇక ఏడు కాంప్లెక్స్ అంటే నాగ్ అశ్విన్ సినిమాటిక్ యూనివర్స్ లో రాబోయే మూవీల్లో వీటి గురించి చూపిస్తాడా? డైరెక్టర్ పెద్ద ప్లానే వేశాడు.. నీ విజన్ కు హ్యాట్సాప్ అంటున్నారు సినీ అభిమానులు. మరి కల్కి సీక్వెల్ లో ఎన్ని వింతలు దాగున్నాయో తెలియాలంటే.. సినిమా వచ్చినదాక ఆగాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by SoSouth (@sosouthofficial)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet