iDreamPost
android-app
ios-app

కంగువ నుంచి క్రేజీ అప్డేట్ .. సూర్య అన్ని గెటప్స్‌లో కనిపిస్తారట..

  • Published Jul 19, 2024 | 10:43 AM Updated Updated Jul 19, 2024 | 10:43 AM

Kanguva Movie: సినీ ఇండస్ట్రీలో నట వారసులుగా వచ్చి సక్సెస్ అయిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో తమిళ స్టార్ హీరో సూర్య ఒకరు. విలక్షణమైన తన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఫేవరెట్ హీరో అయ్యారు.

Kanguva Movie: సినీ ఇండస్ట్రీలో నట వారసులుగా వచ్చి సక్సెస్ అయిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో తమిళ స్టార్ హీరో సూర్య ఒకరు. విలక్షణమైన తన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఫేవరెట్ హీరో అయ్యారు.

  • Published Jul 19, 2024 | 10:43 AMUpdated Jul 19, 2024 | 10:43 AM
కంగువ నుంచి క్రేజీ అప్డేట్ .. సూర్య అన్ని గెటప్స్‌లో కనిపిస్తారట..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. తన సహనటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్, కోలీవుడ్ లో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. తమిళంలో ఏ సినిమా రిలీజ్ అయిన వెంటనే తెలుగులో డబ్ చేస్తుంటారు. గత కొంత కాలంలో నేషనల్ వైడ్ గా తన మూవీస్ తో ఆకట్టుకుంటున్నాడు. ఆకాశం నీ హద్దురా, జై భీం లాంటి సినిమాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘కంగువా’ పాన్ ఇండియా వైడ్ గా రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి.తాజాగా కంగువా నుంచి లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..

సూర్య నటించిన ‘కంగువా’ అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈమూవీకి సంబంధించిన ఓ సెన్సేషన్ న్యూస్ ఫిలిమ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న కంగువా మూవీ కథ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట.ఈ మూవీలో సూర్య మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. ఈ మూడు పాత్రల కోసం సూర్య తన లుక్ ని మార్చుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆయన నటించిన మూడు పాత్రలు ‘కంగువ’ కథ అదిరిపోయే ట్విస్ట్ ని తీసుకువస్తుందని ఫిలిమ్ వర్గాల్లో టాక్. ఇటీవల కంగువా నుంచి సూర్య రెండు లుక్ లు రివీల్ చేసిన విషయం తెలిసిందే.

కత్తి పట్టిన యుద్ద వీరుడు కంగువా, మోడరన్ వారియర్ గా సూర్య ఎదురెదురు నిల్చన్న స్టిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ గతం, వర్తమానం, భవిష్యత్ తో మొదలువుతందని క్యాప్షన్ తో మూవీ కాన్సెప్ట్ చెప్పకనే చెప్పారు.ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డీయోలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే యానీమల్ తో బాబీ డియోల్ కి దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. బాబీతో పాటు దిశా పటానీ కూడా కీలక పాత్రలో కనిపించబోతుందట. ఈ మూవీలో నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య చివరిసారిగా అక్షయ్ కుమార్ నటించిన ‘సర్పిరా’ మూవీలో అతిధి పాత్రలో కనిపించాడు.

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetgar girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel