iDreamPost
android-app
ios-app

Kamal Haasan: భారతీయుడు 2 ఎఫెక్ట్.. రూటు మార్చిన కమల్!

  • Published Jul 19, 2024 | 12:27 PM Updated Updated Jul 19, 2024 | 12:40 PM

భారతీయుడు 2 మూవీ ఇచ్చిన ఫలితంతో విశ్వనటుడు కమల్ హాసన్ తన నెక్ట్స్ మూవీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి కమల్ తీసుకున్న ఆ డెసిషన్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

భారతీయుడు 2 మూవీ ఇచ్చిన ఫలితంతో విశ్వనటుడు కమల్ హాసన్ తన నెక్ట్స్ మూవీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి కమల్ తీసుకున్న ఆ డెసిషన్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Jul 19, 2024 | 12:27 PMUpdated Jul 19, 2024 | 12:40 PM
Kamal Haasan: భారతీయుడు 2 ఎఫెక్ట్.. రూటు మార్చిన కమల్!

ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన శంకర్-కమల్ హాసన్ మూవీ భారతీయుడు 2.. ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. నిడివి ఎక్కువైందని విమర్శలు రావడంతో.. నిడివి తగ్గించారు మేకర్స్. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. మార్నింగ్ షో నుంచే ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. బయ్యర్లకు ఇండియన్ 2తో భారీ నష్టాలు వచ్చాయి. ఈ సినిమా ఫలితంతో విశ్వనటుడు కమల్ హాసన్ తన రూట్ మార్చినట్లు తెలుస్తోంది. నెక్ట్స్ రాబోయే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ నిర్ణయానికి వచ్చినట్లు టాక్.

శంకర్-కమల్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు 2 అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో శంకర్ మార్క్ ఈ సినిమాలో కనిపించలేదు. దాంతో పాటుగా నిడివి ఎక్కువైందని మరో విమర్శ కూడా ఉంది. ఇక భారతీయుడు 2 ఎఫెక్ట్ కమల్ హాసన్ పై బాగానే పడినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం ఇచ్చిన  ఫలితంతో తన నెక్ట్స్ రాబోయే చిత్రాల విషయంలో తన రూట్ మార్చినట్లు తెలుస్తోంది. ఇండియన్ 2 పాటుగా ఇండియన్ 3 మూవీ కూడా దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. కొంత భాగం మాత్రమే షూట్ బ్యాలెన్స్ ఉందట. లెక్క ప్రకారం మరో 5 నెలల్లో పార్ట్ 3 కూడా థియేటర్లలోకి రావాలి. కానీ భారతీయుడు 3 కోసం కమల్ నెల షూటింగ్ చేయాల్సి ఉంది. పైగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. దాంతో ఈ మూవీని కొన్నాళ్లు ఆపాలని కమల్ భావిస్తున్నట్లు సమాచారం.

అయితే భారతీయుడు 3 కంటే ముందుగా మణిరత్నం దర్శకత్వంలో చేస్తున్న ‘థగ్ లైఫ్’ చిత్రాన్ని తీసుకురావాలని చూస్తున్నాడట. థగ్ లైఫ్ మూవీ తర్వాతే ఇండియన్ 3 సినిమా రిలీజ్ అవుతుందట. ఇక కమల్ చెప్పిన దానికి డైరెక్టర్ శంకర్ కూడా ఒప్పుకున్నాడట. ఎందుకంటే? ఈలోగ రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్ మూవీని కంప్లీట్ చేయాలన్నది శంకర్ ఆలోచన. పైగా గేమ్ ఛేంజర్ సూపర్ డూపర్ హిట్ అయితే.. ఆ ఫలితం ఇండియన్ 3 మూవీకి కలిసొస్తుంది అన్నది వీరిద్దరి ఆలోచనలుగా తెలుస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş