iDreamPost

స్వర్గంలో ప్లాట్స్ అమ్మబడును.. పాస్టర్ వింత ప్రకటన.. ఎగబడి కొంటున్న జనాలు!

Church Pastor Selling Plots In Heaven: ఓ సినిమాలో తనికెళ్ళ భరణి.. హైదరాబాద్ లో ఉన్న ఛార్మినార్, ట్యాంక్ బండ్ వంటివి అమ్మేస్తూ ఉంటారు. అదే ఛార్మినార్, ట్యాంక్ బండ్ లని ఒకరికి తెలియకుండా మరొకరికి అమ్ముతారు. అయితే అది సినిమా కోసం కాబట్టి కామెడీ కోసం చేశారనుకోవచ్చు. కానీ ఇక్కడ ఓ చర్చి పాస్టర్ నిజంగానే స్వర్గంలో ప్లాట్స్ అమ్ముతున్నారు. జనం కూడా ఎగబడి కొంటున్నారట. ఇంతకీ ఎక్కడంటే?

భూమి మీద స్థలాలకు డిమాండ్ అనేది ఎప్పటికప్పుడు పెరిగిపోతుంది. పెరుగుతున్న జనాభాకు ఫ్యూచర్ లో భూమి దొరకడం కష్టమవుతుందని.. ఈ క్రమంలో భూముల ధరలు సామాన్యుడి నెత్తిన పిడుగులా మారతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో చాలా మంది శక్తి మేరకు వీలైనంత భూమిని కొనుగోలు చేస్తున్నారు. కొంచెం డబ్బున్న వాళ్ళు అయితే ఏకంగా చంద్రుడి మీదనే ప్లాట్లు కొనుక్కుంటున్నారు. అయితే చంద్రుడి మీద, భూమ్మీద కాదు.. ఏకంగా స్వర్గంలోనే ప్లాట్లు అమ్ముతున్నాడో పాస్టర్. అది కూడా హైదరాబాద్ కంటే చాలా చౌక ధరకే అమ్ముతున్నాడు. మరి పాస్టర్ కథేంటి? ఆ ప్లాట్ల విక్రయాలు ఏంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. 

స్పెయిన్ లోని ఓ చర్చి స్వర్గంలో స్థలాలను అమ్మకానికి పెట్టింది. అసలు అక్కడ స్థలాలు ఉన్నాయో లేదో తెలీదు గానీ ఆ చర్చి పాస్టర్ ఇంటోమ్స్ మాత్రం స్వర్గంలో ఉన్న భూములను అమ్మకానికి పెట్టాడు. తాను 2017లో దేవుడితో మాట్లాడానని.. స్వర్గంలో చదరపు మీటరు స్థలాన్ని 100 డాలర్ల చొప్పున విక్రయిస్తున్నా అని వెల్లడించాడు. మన కరెన్సీ ప్రకారం.. చదరపు మీటరు 8,350 రూపాయలు. అంటే ఎకరం 3 కోట్ల పైమాటే. తాను విక్రయించే స్థలాల్లో స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడి నివాసం పక్కనే ఉన్న స్థలాలను కూడా అమ్ముతున్నట్లు పాస్టర్ ఇంటోమ్స్ వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఒక బ్రౌచర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందులో మేఘాల్లో ఒక ఇల్లు తేలుతుండగా.. ఎదురుగా ఒక కుటుంబం మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. ఆ పక్కనే గూగుల్ పే, యాపిల్ పే, క్రెడిట్ కార్డు వంటి పేమెంట్ ఐకాన్స్ ఉన్నాయి. ఈ పిక్ కింద మరో పిక్ ఉంది. ఆ పిక్ లో ఒక ఇంటి ఎదురుగా తండ్రీ, కూతురికి జీసస్ స్వాగతం చెబుతున్నట్లు ఉంది. స్వర్గంలో ప్లాట్లు, ఇల్లు నిజమని నమ్మిన కొంతమంది ప్లాట్లు కొన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఇలానే ఒక పాస్టర్ స్వర్గంలో ఇల్లు అమ్మడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఒక పాస్టర్ 2023లో తన దగ్గరకు వచ్చిన వారి నుంచి భూములు, ఆస్తులు అమ్మించి వారితో స్వర్గంలో స్థలాలు కొనిపించాడు. తాజాగా మరో పాస్టర్ స్వర్గంలో ప్లాట్స్ న అమ్ముతూ వైరల్ అయ్యాడు. ఈ వార్త విన్న రియల్ ఎస్టేట్ నిపుణుడు అర్మాండో పాంటోజా దాని మీద కౌంటర్ గా ఒక వీడియో చేశారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ డీల్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా ఈ వీడియోపై నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Armando Pantoja (@tallguytycoon)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి