iDreamPost

ఐ ఫోన్ పై మరో ఆఫర్.. కానీ ఏదో తేడా కొడుతుంది

కొత్త ఫోన్ వచ్చిన ప్రతి సారి మనం కూడా ఫోన్ మార్చాలంటే అది జరిగే పని కాదు, కాన్ కొత్త ఫోన్ ని రిలీజ్ చేసిన ప్రతి సారి కూడా పాత మోడల్స్ ని ఆఫీసర్స్ లా అమ్మేయ్యడం ఒక ఆనవాయతిలా మారిపోయింది.

కొత్త ఫోన్ వచ్చిన ప్రతి సారి మనం కూడా ఫోన్ మార్చాలంటే అది జరిగే పని కాదు, కాన్ కొత్త ఫోన్ ని రిలీజ్ చేసిన ప్రతి సారి కూడా పాత మోడల్స్ ని ఆఫీసర్స్ లా అమ్మేయ్యడం ఒక ఆనవాయతిలా మారిపోయింది.

ఐ ఫోన్ పై మరో ఆఫర్.. కానీ ఏదో తేడా కొడుతుంది

ఐ ఫోన్ లో ఈ మధ్యన ఒక సంవత్సరంలోనే రెండు నుండి మూడు మోడల్స్ ని లాంచ్ చేస్తున్నారు. కొత్త ఫోన్ వచ్చిన ప్రతి సారి మనం కూడా ఫోన్ మార్చాలంటే అది జరిగే పని కాదు, కాన్ కొత్త ఫోన్ ని రిలీజ్ చేసిన ప్రతి సారి కూడా పాత మోడల్స్ ని ఆఫీసర్స్ లా అమ్మేయ్యడం ఒక ఆనవాయతిలా మారిపోయింది. ఇప్పుడు ఐ ఫోన్ కూడా అదే ఫార్ములా బేస్డ్ సేల్ ని చేస్తుంది. iPhone 14 Plus ఇప్పుడు Flipkartలో జస్ట్ 55,000 రూపాయల కన్నా తక్కువ ప్రైస్ లో ఉంది. ఇంకో పక్క యూజర్స్ ఏం ఆలోచిస్తున్నారు అంటే కొద్ది నెలలలో iPhone 16 లాంచ్ అవుతుంది కదా ఇప్పుడు ఈ iPhone 14 Plus మీద ఇన్వెస్ట్మెంట్ అవసరమా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు.

ప్రెసెంట్ 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 55,999కు ఫ్లిప్ కార్ట్ లో సేల్ కి పెట్టారు. అలానే Axis క్రెడిట్ కార్డ్ ఉంటె ఇంకో 2,800 బ్యాంక్ సైడ్ నుండి ఆఫర్ వస్తుంది, దీని వల్ల ఎఫెక్టివ్ ప్రైస్ 53,199 అవుతుంది. కాని ఇక్కడ ఇంటరెస్టింగ్ ఏంటి అంటే ఇదే ఫోన్ Apple ఆఫిషియల్ వెబ్‌సైట్‌లో 79,999 ప్రైస్ తో ఉంది. iPhone 14 Plus 6.7 – ఇంచెస్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో వస్తుంది. Apple’s పవర్ఫుల్ A15 బయోనిక్ చిప్‌సెట్ తో iOS 16 పై రన్ అవుతుంది. ఇది 128GB, 256GB, ఇంకా 512GB ఈ మూడు స్టోరేజ్ ఆప్షన్లలో అవైలబుల్ గా ఉంది. ఈ డివైస్‌లో 12-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా ఇంకా అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. వీటి వలన అడ్వాన్స్డ్ ఫోటోగ్రఫీని ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు. సెల్ఫీస్ అండ్ వీడియో కాల్స్ కోసం 12-మెగాపిక్సెల్ TrueDepth కెమెరాతో, వీడియో ప్లేబ్యాక్ టైం 26 గంటలు వరుకు ఉంటుంది.

కాకపోతే ఇక్కడ ఈ సేల్ కి వచ్చిన చిక్కు ఏంటి అంటే iPhone 16 కూడా త్వరలోనే రిలీజ్ చేస్తునారు కాబట్టి ఎప్పుడో రెండు సంవత్సరాల ముందు లాంచ్ చేసిన ఈ పాత డివైస్‌లో ఇన్వెస్ట్ చెయ్యడం వైస్ డెసిషన్ కాదు అని. అంతే కాకుండా Apple iOS 18లో కొత్తగా చాలా AI ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేసింది. కానీ ఈ ఫీచర్లు iPhone 15 Pro నుంచి మాత్రమే వస్తున్నాయి. అంటే ఒక ఫోన్ కి 50,000 పైన ఖర్చు పెట్టి తీసుకున్నప్పటికీ కొత్త అడ్వాన్స్డ్ AI ఫీచర్స్ యూస్ చేసుకోలేము. కాబట్టి ఏదో తక్కువకి వస్తుంది కదా అని ఆవేశ పడకుండా, కొంచం సహనంతో ఉండి. అడ్వాన్స్డ్ ఫీచర్లను ఉండే iPhone 16 రిలీజ్ అయ్యే వరుకు వెయిట్ చెయ్యడం బెటర్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి