iDreamPost

భార్య రాసిన స్క్రీన్ ప్లే.. 3 ఏళ్ళ క్రితం భర్తని లేపేసి.. ప్రియుడితో హ్యాపీగా!

వామ్మో ఈమె మామూలు మహిళ కాదు... భర్తను లేపేందుకు సినిమా లెవల్లో స్క్రీన్ ప్లే గీసింది. భర్తను చంపేందుకు సుపారీ ఇచ్చింది. ఓ సారి తృటిలో తప్పించుకున్నాడు భర్త.. కానీ రెండో సారి మిస్ కాలేదు.

వామ్మో ఈమె మామూలు మహిళ కాదు... భర్తను లేపేందుకు సినిమా లెవల్లో స్క్రీన్ ప్లే గీసింది. భర్తను చంపేందుకు సుపారీ ఇచ్చింది. ఓ సారి తృటిలో తప్పించుకున్నాడు భర్త.. కానీ రెండో సారి మిస్ కాలేదు.

భార్య రాసిన స్క్రీన్ ప్లే.. 3 ఏళ్ళ క్రితం భర్తని లేపేసి.. ప్రియుడితో హ్యాపీగా!

తప్పు చేసి తప్పించుకుందామని అనుకుంటారు కొందరు.. కర్మ ఫలితం ఎప్పటికైనా అనుభవించాల్సిందే. ఇదిగో ఇదే జరిగింది నిధి విషయంలో. నిధి, వినోద్ బరాదా భార్యా భర్తలు. వినోద్ ఒకసారి ప్రమాదం నుండి తృటిలో తప్పించుకోగా.. రెండో సారి కాల్పుల్లో మరణించాడు. దీనిపై మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేవ్ సునర్ అనే వ్యక్తిని పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అతడే ఈ హత్య చేశాడని జైలులో పెట్టారు. కానీ మృతుడి సోదరుడికి అనుమానం వచ్చి.. ఈ కేసు గురించి పోలీసులను వాట్సప్ ద్వారా సంప్రదించాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారి..  ఈ కేసు పున: ప్రారంభించడానికి కోర్టు అనుమతి తీసుకుని, విచారణ బృందాన్ని నియమించి దర్యాప్తు చేయగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయడానికి స్కెచ్ వేసిందని.. ఆ నేరం చేసేలా దేవ్ సునర్‌‌తో సుఫారీ మాట్లాడుకున్నారని తెలిసింది. సినిమా లెవల్లో స్క్రీన్ ప్లే రాసిన ఈ రియల్ స్టోరీ హర్యానాలోని పానిపట్‌లో 2021లో జరిగింది. పథకం ప్రకారం భర్తను హత్య చేసిన నిధి, ఆమె ప్రియుడు సుమిత్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. నిధి.. సుమిత్ అనే ప్రేమ వ్యవహారం నడిపింది. అప్పట్లో ఆమె జిమ్‌కు వెళ్లేది. అక్కడ ఫిట్నెస్ ట్రైనర్ సుమిత్‌తో పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరు తరచుగా ఫోనులో మాట్లాడుకునేవారు. దీంతో భర్తను అనుమానం వచ్చి నిలదీశాడు. అతడి అడ్డు తొలగించుకోవాలని భావించారు. పథకం అమలు చేసేందుకు సుమిత్.. దేవ్ సునర్‌తో రూ. 10 లక్షలు డీలింగ్ కుదుర్చుకున్నాడు. ఓ రోజు పంజాబ్ రిజిస్ట్రేషన్ వాహనం వినోద్‌ను ఢీకొట్టింది.

ఆ వాహనంతో ఢీ కొట్టింది దేవ్ సునరే. కానీ ఇందులో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు వినోద్. రెండు కాళ్లు విరిగిపోయాయి. రెండు నెలల తర్వాత డిసెంబర్ 15న వినోద్ హత్య చేశాడు దేవ్ సునర్. మృతుడి మేనమామ ఫిర్యాదు చేయగా.. దేవ్ సునర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు జైలులో ఉన్నాడు. అయితే వినోద్ సోదరుడు మళ్లీ అనుమానం వచ్చి పోలీసులను సంప్రదించగా.. మళ్లీ కేసును తిరగతోడారు. భార్య నిధినే.. ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ఈ కుట్రలు చేసిందని తేలింది. దేవ్ సునర్ వ్యక్తితో సుఫారీ మాట్లాడుకున్నారని నిర్దారణ అయ్యింది. తొలుత యాక్సిడెంట్ చేయించగా.. అది తప్పడంతో.. మళ్లీ జైలులో ఉన్న దేవ్ బెయిల్ ఇప్పించి.. అతడితోనే మళ్లీ సుఫారీ మాట్లాడారు. డిసెంబర్ 15న వినోద్ ఇంటికి వెళ్లిన దేవ్.. వినోద్ పై కాల్పులు జరపడంతో మరణించాడు. కాగా, సుమిత్.. దేవ్ కుటుంబానికి అయ్యే ఖర్చులు పెట్టుకుంటున్నాడు. తాజాగా దర్యాప్తులో ఈ హత్యకు భార్య, ఆమె ప్రియుడి కారణమని తెలుసుకున్న పోలీసులు.. ఇద్దర్నీ అరెస్టు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి