iDreamPost

Rinku Singh: వీడియో: ఫ్లైట్ లో నిద్రపోతున్న రింకూ.. ఆఫ్గాన్ ప్లేయర్ ఏం చేశాడో చూడండి!

రెండో మ్యాచ్ కోసం ఆటగాళ్లందరూ ఇండోర్ కు విమానంలో బయలుదేరారు. ఈ క్రమంలోనే ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ రింకూ సింగ్ విమానంలో నిద్రపోతుండగా.. ఆఫ్గాన్ ప్లేయర్ చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

రెండో మ్యాచ్ కోసం ఆటగాళ్లందరూ ఇండోర్ కు విమానంలో బయలుదేరారు. ఈ క్రమంలోనే ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ రింకూ సింగ్ విమానంలో నిద్రపోతుండగా.. ఆఫ్గాన్ ప్లేయర్ చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Rinku Singh: వీడియో: ఫ్లైట్ లో నిద్రపోతున్న రింకూ.. ఆఫ్గాన్ ప్లేయర్ ఏం చేశాడో చూడండి!

ప్రస్తుతం టీమిండియా-ఆఫ్గానిస్తాన్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మెుహాలి వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత ఆటగాళ్లు సమష్టిగా రాణించి తొలి పోరులో గెలుపొందారు. దీంతో సిరీస్ లో 1-0తో ముందంజలోకి దూసుకెళ్లింది భారత్. ఇక రెండో మ్యాచ్ కోసం ఆటగాళ్లందరూ ఇండోర్ కు విమానంలో బయలుదేరారు. ఈ క్రమంలోనే ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ రింకూ సింగ్ విమానంలో నిద్రపోతుండగా.. ఆఫ్గాన్ ప్లేయర్ గుర్బాజ్ చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

సాధారణంగా క్రికెట్ ప్లేయర్ల మధ్య గ్రౌండ్ లేనే కాకుండా.. బయటకూడా మంచి వాతావరణమే ఉంటుంది. ఇక ఐపీఎల్ పుణ్యమాని ఇతర జట్ల ఆటగాళ్లతో ఫ్రెండ్షిప్ ఏర్పడుతున్న విషయం మనందరికి తెలిసిందే. దీంతో మ్యాచ్ మధ్యలో, మ్యాచ్ అనంతరం కొందరు తన సహచర ఆటగాళ్లను ఆటపట్టిస్తూ ఉంటారు. ఇక అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం మనం చూసే ఉన్నాం. తాజాగా భారత ప్లేయర్ రింకూ సింగ్, ఆఫ్గాన్ వికెట్ కీపర్ రహ్మనుల్లా గుర్బాజ్ మధ్య ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. మెుహాలీలో మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు రెండో టీ20 కోసం ఇండోర్ కు ప్రత్యేక విమానంలో బయలుదేరారు.

ఈ క్రమంలో టీమిండియా ఫినిషర్ రింకూ సింగ్ ప్రశాంతంగా ఫ్లైట్ లో నిద్రపోతున్నాడు. ఈ టైమ్ లో ఆఫ్గాన్ వికెట్ కీపర్ వచ్చి అతడి ముక్కులో వేలుపెట్టాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు రింకూ. గుర్భాజ్ ను చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు. రింకూ తల దువ్వి సరదాగా కాసేపు ఆడుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఆటగాళ్ల మధ్య ఇలాంటి అనుబంధం ఉండాలని పేర్కొంటున్నారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం(జనవరి 14)న ఇండోర్ వేదికగా జరగనుంది. ఈ పోరులో నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది టీమిండియా. అటు ఆఫ్గాన్ జట్టు కూడా ఈ మ్యాచ్ లో విజయం సాధించి.. సిరీస్ ను సమం చేయాలని ఆరాటపడుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి