iDreamPost

Fahadh Fazil: తలైవా కూలి మూవీ లో ఫహద్ స్పెషల్ రోల్.. ఇంతకు ఏమైంటుంది !

  • Published Jun 14, 2024 | 11:24 AMUpdated Jun 14, 2024 | 11:24 AM

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ మలయాళ నటుడికి వరుసగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరో సినిమాలో ఫహద్ కు అవకాశం వచ్చినట్లు సమాచారం.

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ మలయాళ నటుడికి వరుసగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరో సినిమాలో ఫహద్ కు అవకాశం వచ్చినట్లు సమాచారం.

  • Published Jun 14, 2024 | 11:24 AMUpdated Jun 14, 2024 | 11:24 AM
Fahadh Fazil: తలైవా కూలి మూవీ లో ఫహద్ స్పెషల్ రోల్.. ఇంతకు ఏమైంటుంది !

ఫాహద్‌ ఫాజిల్‌.. ఈ పేరు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అతికొద్ది పాపులర్ మలయాళ హీరోల్లో.. ఫాహద్ ఫాజిల్ కూడా ఒకరు. కేవలం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కారణంగా.. సౌత్ టు నార్త్ ఫహద్ పేరు మారుమోగింది చెప్పి తీరాలి. కేవలం మలయాళ సినిమాలలోనే కాకుండా తెలుగులో కూడా ఫహద్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం విలన్ గా ఫహద్ కు తెలుగులో భారీ స్థాయిలో గుర్తింపు లభించింది. పుష్ప సినిమాలో విలన్ రోల్ లో ఫహద్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ -1 లో అయితే ఫహద్ నటన గురించి అందరికి తెలిసిందే. మరి పార్ట్ -2 లో ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంది. ఈ క్రమంలో ఫహద్ కు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కిందంట.. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

రజిని కాంత్ జైలర్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా రజిని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సినిమా డిజాస్టర్ గా నిలిచినా కూడా.. ఇప్పుడు మాత్రం రజిని వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రజిని కాంత్.. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో “వేట్టైయన్” అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే . ఈ మూవీ రజిని కెరీర్ లోనే 170వ మూవీగా తెరకెక్కనుంది. ఈ సినిమాలో అమిత బచ్చన్, రానా, రితిక సింగ్ వంటి ఎంతో మంది ప్రముఖ నటి నటులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాను అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఇదిలా ఉంటె.. రజిని నటిస్తున్న మరొక సినిమా కూలి.

Cooli Movie

ఈ సినిమాను ప్రముఖ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటె ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఫహద్ ఇప్పటికే లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ లో వచ్చిన విక్రమ్ సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించి అందరిని మెప్పించాడు. ఇప్పుడు రజిని కాంత్ మూవీ లో కూడా ఫహద్ కు ఓ మంచి క్యారెక్టర్ పడితే కనుక ఫహద్ క్రేజ్ ఇంకాస్త పెరిగిపోతుందని చెప్పి తీరాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి