iDreamPost

కోట్ల విలువ చేసే కారును కొనుగోలు పృథ్వీరాజ్ సుకుమారన్!

Prithviraj Sukumaran: సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కోట్ల విలువ చేసే కారును కొనుగోలు చేశాడు. తన భార్యతో కలిసి ఈ కారును పృథ్వీరాజ్ కొన్నారు. ప్రస్తుతం ఈ కారు ఖరీదు తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Prithviraj Sukumaran: సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కోట్ల విలువ చేసే కారును కొనుగోలు చేశాడు. తన భార్యతో కలిసి ఈ కారును పృథ్వీరాజ్ కొన్నారు. ప్రస్తుతం ఈ కారు ఖరీదు తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.

కోట్ల విలువ చేసే కారును కొనుగోలు పృథ్వీరాజ్ సుకుమారన్!

సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఖరిదైన వస్తువులను వినియోగిస్తారనే విషయం మనకు తెలిసిందే. ఈక్రమంలోనే కొందరు సెలబ్రిటీలు వినియోగించే వస్తువులు అందరిని ఆకట్టుకుంటాయి. అంతేతాక మరికొందరు తరచూ  ఖరీదైన వాచ్ లు, కారులు, ఇతర వస్తువులను కొనుగోలు చూస్తుంటారు. ఇక వాటి విలువ తెలిస్తే..కొన్ని సార్లు షాకి గురికావాల్సిందే. తాజాగా సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కోట్ల విలువ చేసే కారును కొనుగోలు చేశాడు. తన భార్యతో కలిసి ఈ కారును పృథ్విరాజ్ కొనుగోలు చేశాడు. ఇప్పుడు దీని ఖరీదు తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు. మరీ.. ఆ కారు ఖరీదు ఎంతా, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు. సలార్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచతమయ్యారు. ఇక ఆ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కి మంచి మార్కులే  పడ్డాయి.  ఇటీవలే ఆయన బడే మియాన్ చోటే మియాన్‌లో చిత్రంలో కనిపించారు. అంతకుముందు మలయాళంలో తెరకెక్కించిన ఆడు జీవితం(ది గోట్ లైఫ్) సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. ఈ చిత్రంలో అమలాపాల్‌ హీరోయిన్‌గా నటించింది. దుబాయ్‌లో ఓ వ్యక్తి  రియల్ లైఫ్ ఆధారంగా  ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధించింది. ఇది ఇలా ఉంటే.. పృథ్వీరాజ్ సుకుమాన్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆయన ఖరీదైన కారును కొనుగోలు చేశారు. తన భార్య సుప్రియా మీనన్ తో కలిసి ఆ కారును కొనుగోలు చేశారు. పోర్షే  911 జీటీ3 అనే మోడల్ కారును పృథ్వీరాజ్ సుకుమారన్‌ కొనుగోలు చేశారు. సరికొత్త పోర్షే మోడల్ కారు ధర దాదాపు రూ.3 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లగ్జరీ కారుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోర్షే ఇండియా బ్రాండ్ ప్రతినిధులతో పృథ్వీరాజ్ మాట్లాడుతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

ఇక పృథ్వీరాజ్ కారుల అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన తరచు వివిధ రకాల మోడల్ కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటికే లంబోర్గిని, పోర్స్చే, టాటా సఫారి, మినీ కూపర్ లాంటి మోడల్ కార్లు పృథ్విరాజ్. ఇక ఆయన సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం పృథ్వీరాజ్ ఎల్‌-2: ఎంపురాన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అంతేకాక మరికొన్ని ఇతర సినిమాలా షూటింగ్స్ తో కూడా బిజీ బిజీగా గడుపుతున్నారు. మరి.. తాజాగా ఆయన కొనుగులో చేసిన ఖరీదైన కారుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Porsche India (@porsche_in)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి