iDreamPost

యూఎస్‌లో చదివే భారతీయులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అవ్వగానే గ్రీన్ కార్డులు!

Donald Trump Good News To Indians: మీరు మారిపోయారు సార్.. అని టెంపర్ సినిమాలో పోసాని కృష్ణ మురళీ జూనియర్ ఎన్టీఆర్ ని ఉద్దేశించి ఒక డైలాగ్ చెబుతారు. ఇప్పుడు ఈ డైలాగ్ ట్రంప్ కి కరెక్ట్ గా సూట్ అవుతుందేమో. ఒకప్పుడు అమెరికాలో ఉండే విదేశీయులకి అనేక ఆంక్షలు విధించిన ట్రంప్ స్వరం ఇప్పుడు మారింది. ఇప్పుడు ఇతర దేశాల విద్యార్థులపై ప్రేమ కురిపిస్తున్నారు. ఒకప్పుడు మా దేశంలో ఉండకండి పోండి అన్న ట్రంప్.. ఇప్పుడు ఉండండి మిమ్మల్ని బాగకి చూసుకుంటాను అని అంటున్నారు.

యూఎస్ లో చదువు పూర్తి చేసిన తర్వాత అక్కడే శాశ్వతంగా ఉండాలంటే గ్రీన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. విదేశాల నుంచి ఎంతోమంది ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తుంటారు. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగాలు చూసుకుంటారు. పెళ్లిళ్లు కూడా చేసుకుని అక్కడే స్థిరపడతారు. ఇలాంటి వారికి గ్రీన్ కార్డులు కొన్ని నెలల ప్రాసెస్ తర్వాత వస్తాయి. అయితే చదువు పూర్తవ్వగానే గ్రీన్ కార్డులు ఇస్తామని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అమెరికా ముందు.. ఆ తర్వాతే మిగతా దేశాలు అనే విధంగా ప్రవర్తించిన ట్రంప్ ఇప్పుడు మారిపోయారు. విదేశాల నుంచి అమెరికా వచ్చే వారి విషయంలో ట్రంప్ ధోరణి మారింది.

ఈ విషయం తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వింటేనే అర్థమవుతుంది. తాము అధికారంలోకి వచ్చాక అమెరికాలో చదువుకునే విద్యార్థులకు వారి చదువు పూర్తికాగానే గ్రీన్ కార్డులు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రాడ్యుయేట్లకు డిగ్రీ అయిపోయాక వారు అమెరికాలో ఉండేందుకు డిగ్రీతో పాటు గ్రీన్ కార్డులు వెంటనే ఇవ్వాలనుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ గ్రాడ్యుయేషన్ రెండేళ్లు, నాలుగేళ్లు ఉన్నా గానీ గ్రీన్ కార్డులు నేరుగా అందజేస్తామని అన్నారు. జూనియర్ కాలేజీలకు కూడా దీన్ని వర్తింపజేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఈ విధానాన్ని వెంటనే అమలు చేస్తానని అన్నారు.

అధికారంలోకి వచ్చిన మొదటిరోజునే గ్రీన్ కార్డులపై దృష్టి సారిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. వీసా ఆలస్యంగా రావడం, ఇతర సమస్యల కారణంగా భారత్ సహా ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చే విద్యార్థులు చాలా మంది ఇక్కడ ఉండలేకపోతున్నారని.. తిరిగి వారి దేశాలకు వెళ్లిపోతున్నారని.. అలా కాకుండా ఇక్కడే ఉండేలా గ్రీన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన అధికారంలో ఉన్నప్పుడు చట్టబద్ధ వలసదారులపై అనేక ఆంక్షలు విధించారు. వీసా లాటరీ విధానం, కుటుంబ ఆధారిత వీసాల విషయంలో పలు మార్పులు తీసుకొచ్చారు. 2017లో తొలిసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్.. బై అమెరికన్-హైర్ అమెరికన్ నినాదంతో ఉత్తర్వులు జారీ చేశారు. అలాంటి ట్రంప్ ఇప్పుడు తమ దేశంలో చదువుకునే విద్యార్థులకు చదువు అయిపోగానే గ్రీన్ కార్డులు ఇస్తామని ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి