iDreamPost

Balayya Unstoppable : నిజంగానే ఇద్దరు స్టార్లు ఓపెన్ అయ్యారా

Balayya Unstoppable : నిజంగానే ఇద్దరు స్టార్లు ఓపెన్ అయ్యారా

మాములుగా ఓటిటిలో వచ్చే సెలబ్రిటీ టాక్ షోలను మొదటి రోజే ప్రేక్షకులు పట్టించుకోవడం అంతగా ఉండదు. ఎందుకంటే ఇంటర్వ్యూల మాదిరిగానే ఇవి కూడా ఒకరకమైన ఫార్ములాలో ఉంటాయనే అభిప్రాయం కలగడమే. దానికి భిన్నంగా ఆహా కోసం బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ కాన్సెప్ట్ ప్రోమోలు ముందు నుంచి అభిమానులను ఆకట్టుకుంటూ వచ్చాయి. ట్రైలర్ కట్ లో చాలా ఆసక్తికరమైన ప్రశ్నలను చూపించి వదిలేయడంతో వాటికి సమాధానాల కోసం చూసిన వాళ్ళు ఉన్నారు. దీపావళి పండగ సందర్భంగా బాలయ్య మంచు ఫ్యామిలీతో చేసిన ముఖాముఖీని నిన్న స్ట్రీమింగ్ చేశారు.అందులో విశేషాలు చూద్దాం

సుమారు 50 నిమిషాలకు కొంత అదనంగా ఉన్న ఈ ఎపిసోడ్ లో మరీ హై అని చెప్పుకునే మూమెంట్స్ లేవు కానీ ఉన్నంతలో వ్యాఖ్యాతగా బాలయ్య బాగానే మెప్పించారు. బెస్ట్ అని చెప్పలేం కానీ ఎంత సీనియర్ స్టార్ అయినా ఈ వ్యవహారం కొత్త కాబట్టి నెక్స్ట్ గెస్ట్ వచ్చే లోపు పూర్తిగా సెట్ అవ్వొచ్చు. ఇక అందరూ ఎదురు చూసిన చిరంజీవి మీద మీ అభిప్రాయం ఏమిటనే ప్రశ్నకు మోహన్ బాబు సమాధానం చెబుతూ అల్లు రామలింగయ్య అల్లుడు కాబట్టి బాగుండాలని, మంచి నటుడు డాన్సులు బాగా చేస్తాడని స్మార్ట్ గా చెప్పేసి తప్పుకున్నారు. మంచు విష్ణు, లక్ష్మి, మోహన్ బాబుల కన్నా మనోజే మంచోడని బాలయ్య చెప్పడం మరో ట్విస్టు

ఇక చాలా కీలకంగా అనిపించిన సీరియస్ ప్రశ్న ఒకటి మోహన్ బాబు నుంచి బాలయ్యకు తగిలింది. పార్టీ పగ్గాలను వారసుడిగా నువ్వు కాకుండా చంద్రబాబునాయుడుకి ఎందుకు వదిలేశారని అడిగితే దానికి బాలకృష్ణ ఏదో కవర్ చేయబోయారు. వారసత్వ రాజకీయాలు వద్దనుకున్నామని ఏదో అన్నారు కానీ అదంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. మోహన్ బాబు మాత్రం స్వర్గీయ ఎన్టీఆర్ ని వదిలేసి బాబు పంచన చేరడం పట్ల పశ్చాతాపం వ్యక్తం చేయడం నిజాయితీగా అనిపించింది. మొత్తానికి అదిరిపోయే మెరుపులు అద్భుతాలు పెద్దగా లేవు కానీ బాలయ్య కొత్త అవతారంలో ఫ్యాన్స్ కి మంచి జోష్ ఇచ్చారని చెప్పొచ్చు. బోనస్ గా రెండు డాన్సులు కూడా ఉన్నాయి

Also Read : Enemy Movie Report : ఎనిమి సినిమా రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి