iDreamPost
android-app
ios-app

Kannappa: పుష్పరాజ్ కు పోటీగా వస్తున్న కన్నప్ప!

  • Published Jul 18, 2024 | 3:05 PM Updated Updated Jul 18, 2024 | 3:05 PM

పుష్ప 2 మూవీకి పోటీగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ డేట్ కు సంబంధించి విష్ణు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

పుష్ప 2 మూవీకి పోటీగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ డేట్ కు సంబంధించి విష్ణు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 18, 2024 | 3:05 PMUpdated Jul 18, 2024 | 3:05 PM
Kannappa: పుష్పరాజ్ కు పోటీగా వస్తున్న కన్నప్ప!

సినిమాను ఎంత గొప్పగా నిర్మించా అన్నది కాదు.. దాన్ని ఏ టైమ్  లో రిలీజ్ చేశాము అన్నది గొప్ప అంటారు సినీ పండితులు. అయితే చాలా మంది స్టార్స్ పండగల సీజన్స్ నే నమ్ముకుని బరిలోకి దిగుతారు. ఇక అప్పుడప్పుడు అనుకోకుండా స్టార్ హీరోల సినిమాలు పోటీ పడాల్సి వస్తుంది. ఇది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కనిపిస్తున్న సంప్రదాయమే. తాజాగా డిసెంబర్ లో బాక్సాఫీస్ దగ్గర రెండు భారీ చిత్రాలు పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 మూవీకి పోటీగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ డేట్ కు సంబంధించి విష్ణు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ‘కన్నప్ప’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుంది అన్నదానిపై నిన్నటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. కానీ తాజాగా మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా మూవీ రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే? కన్నప్ప డిసెంబర్ లో వస్తున్నట్లు విష్ణు ట్వీట్ చేశాడు. అయితే డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. దాంతో డిసెంబర్ బాక్సాఫీస్ వార్ రసవత్తరంగా మారబోతోంది.

ఇక ఇప్పటికే విడుదలైన కన్నప్ప ఫస్ట్ లుక్, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ మూవీ తెరకెక్కిస్తుండగా.. మోహాన్ బాబు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ లాల్ లాంటి భారీ తారాగణం ఇందులో నటిస్తున్నారు. అయితే డిసెంబర్ మూడు లేదా నాలుగో వారంలో కన్నప్ప రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş