iDreamPost
android-app
ios-app

Hot Spot Telugu OTT: లవర్ కాస్త చెల్లి అయితే.. వైరల్ అవుతున్న సీన్! ఫుల్ మూవీ OTTలో ఉంది!

Hot Spot Telugu Movie OTT Platform: ఓటీటీలోకి క్రేజీ సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక తమిళ్ థ్రిల్లర్ ఓటీటీలోకి రాబోతోంది. అది కూడా ఏ సర్టిఫికేట్ మూవీ అది. కేవలం పెద్దలు మాత్రమే చూడాలి. పిల్లలు ఆ సినిమా చూసేందుకు నిషేధం.

Hot Spot Telugu Movie OTT Platform: ఓటీటీలోకి క్రేజీ సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక తమిళ్ థ్రిల్లర్ ఓటీటీలోకి రాబోతోంది. అది కూడా ఏ సర్టిఫికేట్ మూవీ అది. కేవలం పెద్దలు మాత్రమే చూడాలి. పిల్లలు ఆ సినిమా చూసేందుకు నిషేధం.

Hot Spot Telugu OTT: లవర్ కాస్త చెల్లి అయితే.. వైరల్ అవుతున్న సీన్! ఫుల్ మూవీ OTTలో ఉంది!

ఓటీటీలోకి ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి.  వాటిలో కొన్ని మాత్రం అస్సలు మైండ్ లో నుంచి పోవు. అలాంటి ఒక క్రేజీ సినిమా ఇప్పుడు తెలుగు ఓటీటీలోకి వచ్చేసింది. ఆ మూవీ ఇప్పటికే తమిళ్ లో నానా హంగామా సృష్టించింది. పెద్దలకు మాత్రమే అని చెప్తూ ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఈ కథ ఎంతో కొత్తగా ఉంటుంది. సమాజంలో ఎలా ఉండకూడదో చెప్తూనే.. ప్రస్తుతం యువత ఎలాంటి పెడదోవ పడుతోంది అనే పాయింట్ ను చూపించారు మేకర్స్ . ఇప్పటికే ఈ సినిమాలోని ఓ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే తన లవర్ ను తన ఇంట్లో వాళ్లకు పరిచయం చేద్దాం అని ఇంటికి తీసుకొచ్చిన హీరోకు.. ఆమె అతనికి చెల్లి వరుస అవుతుందని హీరో తల్లి షాక్ ఇస్తుంది. మరి ఆ తర్వాత వాళ్ళేం చేస్తారు. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కచ్చితంగా మీ మైండ్ బ్లాంక్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తమిళనాట అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది కూడా.

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న చిత్రం పేరు హాట్ స్పాట్. ఇది ఒక అడ*ల్ట్ మూవీ జానర్లో వచ్చింది. ఇందులో ఉండే కథలు, చెప్పే పాయింట్లు, చూపించే సీన్స్ అన్నీ కూడా పెద్దలకు మాత్రమే. ముఖ్యంగా అందులో ఉండే డైలాగ్స్ పిల్లలు మాత్రం అసలు వినకూడదు. అలా ఎందుకంటే ఇప్పటి యువత, సమాజంలో జరుగుతున్న దారుణాలు, పోతున్న తప్పుడు మార్గాల గురించి వాటి పర్యావసానాల గురించి చూపించారు. ఈ చిత్రం కచ్చితంగా బో*ల్డ్ చిత్రమే. అందుకని ఆ మూవీ చూడకూడదా అంటే.. కచ్చితంగా చూడాలి. ఈ సినిమా మార్చి 29న తమిళ్ లో రిలీజ్ అయ్యింది. థియేటర్లలో ఈ చిత్రానికి మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ఓటీటీలోకి వచ్చేసింది.

హాట్ స్పాట్ చిత్రంలో కలైయరసన్, ఆదిత్య, శాండీ మాస్టర్, గౌరీ కిషన్, అమ్ము అభిరామి, జననీ అయ్యర్ లు లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ చిత్రాన్ని దర్శకుడు విగ్నేష్ కార్తీక్ సరికొత్తగా ఈ చిత్రాన్ని తీశాడు. ఇప్పటికే ఈ చిత్రం తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, ఇప్పుడు తెలుగు ఓటీటీలోకి ఈ చిత్రం రాబోతోంది. జులై 17 నుంచి ప్రముఖ ఓటీటీ ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా నిర్మించడానికి ముఖ్య ఉద్దేశం.. ఇప్పుడు జరుగుతున్న దారుణాలను ఖండించకపోతే.. అవి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి అని చెప్పడమే.  అలాగే ఇష్టమొచ్చినట్లు జీవిస్తే.. ఆ తర్వాత జీవితాలు ఎంత అధ్వానంగా మారతాయి అనేది కూడా కళ్లకు కట్టినట్లు చూపించారు. మరి.. తెలుగులో ఈ హాట్ స్పాట్ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అంటే తెలుగు వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎలా రియాక్ట్ అవుతారు అనేదే పాయింట్.