iDreamPost
android-app
ios-app

డైరెక్ట్ గా OTT లోకి తెలుగు కామెడీ డ్రామా.. బాలయ్య డై హార్డ్ ఫ్యాన్ కథతో !

  • Published Jul 23, 2024 | 12:10 AMUpdated Jul 23, 2024 | 12:10 AM

OTT Telugu Comedy Drama: తెలుగు కంటెంట్ కు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. దీనితో మేకర్స్ కూడా కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ లో రిలీజ్ అవ్వడానికి రెడీ అయిపోతుంది.

OTT Telugu Comedy Drama: తెలుగు కంటెంట్ కు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. దీనితో మేకర్స్ కూడా కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ లో రిలీజ్ అవ్వడానికి రెడీ అయిపోతుంది.

  • Published Jul 23, 2024 | 12:10 AMUpdated Jul 23, 2024 | 12:10 AM
డైరెక్ట్ గా OTT లోకి తెలుగు కామెడీ డ్రామా.. బాలయ్య డై హార్డ్ ఫ్యాన్ కథతో !

ప్రస్తుతం లెక్కకు మించిన సినిమాలు , సిరీస్ లతో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కళకళలాడుతున్నాయి. ప్రతి వారం ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ కు లోటు రాకుండా.. కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూనే ఉంది. ఇక ఈ మధ్య కాలంలో అయితే తెలుగు కంటెంట్ కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. డైరెక్ట్ గా ఓటీటీ లో తెలుగు సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. పైగా ఆ సినిమాలకు , సిరీస్ లకు అదే రేంజ్ లో డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ ఓటీటీ లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేయండి.

ఇప్పుడు కామెడీ కథల ట్రెండ్ మొదలైందని చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే కనీసం వారానికి ఓ కామెడీ మూవీ అయినా రిలీజ్ అవుతూనే ఉంది. అందులోను తెలుగు కంటెంట్ ఎక్కువగా రిలీజ్ అయ్యే ప్లాట్ ఫార్మ్ ఆహా. ఈ క్రమంలో ఇప్పుడు ఆహలో మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ డ్రామా రాబోతుంది. ఈ సినిమాలో శివ‌రామ‌చంద్ర‌వ‌ర‌పు, శ‌ర‌ణ్య శ‌ర్మ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ సినిమా పేరు “బాలూగాడి టాకీస్”. కాగా ఈ సినిమాలో శివ‌రామ‌చంద్ర‌వ‌ర‌పు, శ‌ర‌ణ్య శ‌ర్మతో పాటు.. ర‌ఘు కుంచే, సుధాక‌ర్‌రెడ్డి, వంశీ నెక్కంటి, సురేష్ పూజారి లాంటి వారు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఆగష్టు సెకండ్ వీక్ లో ఆహా లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

ఇక బాలూగాడి టాకీస్ సినిమా విషయానికొస్తే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆ పోస్టర్ లో పాతకాలం నాటి ప్రొజెక్టర్ , రీల్స్ బాక్స్ లాంటివి కనిపించడంతో పాటు.. దానిపై జై బాలయ్య అని కూడా రాసి ఉంది. దీనితో అందరికి ఈ పోస్టర్ కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. చూడబోతుంటే.. ఇది ఒక పీరియాడిక్ కామెడీ డ్రామా మూవీగా రాబోతున్నట్లు కనిపిస్తుంది. ఇక స్టోరీ లైన్ విషయానికొస్తే.. బాలు అనే అతను పాతకాలం నాటి థియేటర్ ను నడుపుతూ ఉంటాడు. అతను బాలకృష్ణ వీరాభిమాని అవ్వడంతో.. థియేటర్ లో ఎక్కువగా బాలయ్య సినిమాలే వేస్తూ ఉండేవాడు. మరి అదే థియేటర్ ను నమ్ముకున్న బాలు జీవితం ఎలా ముందుకు సాగింది ? అతని థియేటర్ కు పాత కళ వచ్చిందా లేదా ? అసలు పూర్తి కథ ఏమై ఉంటుంది ? అనేదే తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి