iDreamPost

భార్య మీద కోపంతో భర్త దారుణం.. మరీ ఇంత ఘోరమా?

కలకాలం కలిసి ఉంటామని ప్రమాణాలు చేసుకుంటున్న పెళ్లిళ్లు.. ఏడాదికే పెటాకులు అవుతున్నాయి. భార్యా భర్తల మధ్య సఖ్యత కొరవడుతోంది. ప్రతి విషయాన్ని బూతద్దంలో పెట్టుకుని చూస్తూ.. సమస్యను పెద్దది చేసుకుని మానసిక హింసకు గురౌతున్నారు.

కలకాలం కలిసి ఉంటామని ప్రమాణాలు చేసుకుంటున్న పెళ్లిళ్లు.. ఏడాదికే పెటాకులు అవుతున్నాయి. భార్యా భర్తల మధ్య సఖ్యత కొరవడుతోంది. ప్రతి విషయాన్ని బూతద్దంలో పెట్టుకుని చూస్తూ.. సమస్యను పెద్దది చేసుకుని మానసిక హింసకు గురౌతున్నారు.

భార్య మీద కోపంతో భర్త దారుణం.. మరీ ఇంత ఘోరమా?

భార్య భర్తల బంధంలో గొడవలు, ఘర్షణలు, అపార్ధాలు వస్తుంటే.. ముందుగా బలౌతుంది పిల్లలే. పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలు, అంతలో భార్యా భర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి అవి పెద్దవై.. నువ్వెంతంటే.. నువ్వెంత అనే వరకు వస్తున్నాయి. ముఖ్యంగా అనుమానాలు, ఆర్థిక బలహీనత మరింత దోహదం చేసుకుస్తున్నాయి. దీంతో తాము ఆలుమగలమన్న విషయాన్ని మరచి.. బద్ధ శత్రువుల్లా మారిపోతున్నారు. ప్రతి కోపాన్ని పిల్లలపై ప్రదర్శిస్తుంటారు. ఆవేశంలో తీవ్ర నిర్ణయాలు చేస్తూ.. నిండు ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్నారు. వీరితో పాటు కడుపున పుట్టిన బిడ్డల్ని సైతం ఏమాత్రం ఆలోచించకుండా చంపేస్తున్నారు. ఓ భర్త.. భార్యపై కోపంతో కుటుంబం మొత్తాన్ని బలితీసుకోవాలనుకున్నాడు.. కానీ

తమిళనాడులో ఘోరం జరిగింది. భార్యపై కోపాన్ని, అక్కసును పెంచుకున్న భర్త.. పిల్లలకు విషమిచ్చాడు. అయినా చనిపోలేదని గ్రహించి.. గొంతు పిసికి చంపేశాడీ కిరాతక తండ్రి. వివరాలు ఇలా ఉన్నాయి.. కృష్ణ గిరి జిల్లా కావేరీ పట్నం సమీపంలోని ఎన్ తట్టకల్ గ్రామానికి చెందిన కడలరసు, జనని భార్యా భర్తలు. వీరికి దేవరాజ్ అనే 4 ఏళ్ల కుమారుడు, 2 ఏళ్ల నివంతిక అనే కుమార్తె ఉన్నారు. అయితే కొన్నాళ్ల పాటు సాఫీగా సాగిపోయిన వీరి సంసారంలో ఇటీవల గొడవలు మొదలయ్యాయి. పెద్ద పెద్ద తగాదాలు జరుగుతుండటంతో భార్య జననిపై అక్కసు పెంచుకున్నాడు భర్త. ఆమెను చంపి, తాను చనిపోవాలనుకున్నాడు. అయితే గుడికి వెళదామని ప్రేమగా పిలిచి.. కుటుంబమంతా దైవ దర్శనానికి వెళ్లారు.

దైవ దర్శనం అనంతరం ప్రసాదం తీసుకుని..అందులో విషం కలిపి ముందుగా పిల్లలకు ఇచ్చాడు. ప్రసాదం తిన్న పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పిల్లలు చనిపోలేదని భావించి.. గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత జననికి కూడా విష ప్రసాదం ఇచ్చి.. తాను తిన్నాడు. ఆ సమయంలో జనని కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. భార్యా భర్తలిద్దరినీ అంబులెన్స్ లో తరలించారు. పిల్లల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యపై కోపంతో పిల్లల్ని పొట్టనబెట్టుకున్న ఈ తండ్రి కిరాతకం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి