iDreamPost
android-app
ios-app

అమ్మాయిలకు గుడ్ న్యూస్..నెలసరి సెలవులు విధానం అమలు!

Chhattisgarh: మహిళలు అనేక రకాల మానసిక, శారీర సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాటిల్లో నెలసరి సమస్య ఒకటి. ఇది ఆడవాళ్లకు ఎంత నరకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఓ యూనిర్శిటీ విద్యార్థినులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Chhattisgarh: మహిళలు అనేక రకాల మానసిక, శారీర సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాటిల్లో నెలసరి సమస్య ఒకటి. ఇది ఆడవాళ్లకు ఎంత నరకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఓ యూనిర్శిటీ విద్యార్థినులకు గుడ్ న్యూస్ చెప్పింది.

అమ్మాయిలకు గుడ్ న్యూస్..నెలసరి సెలవులు విధానం అమలు!

ఆడవారు ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే  అంశాల్లో నెలసరి ఒకటి. ఈ సమయంలో వారు ఎంతో ఇబ్బందులకు గురవుతుంటారు. ఇక ఉద్యోగం, చదువునే ఆడవాళ్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఈ క్రమంలోనే వారికి నెలసరి సమయంలో సెలవులు విషయంలో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో తాజాగా ఓ యూనివర్సిటీ.. అక్కడివిద్యార్థినులకు ఓ శుభవార్త చెప్పింది. ఆ విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయంతో అమ్మాయిలకు భారీ ఉపశమనం కలగనుంది. మరి.. న్యూస్ ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఛత్తీస్ గడ్ లోని హిదయతుల్లా  జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం చాలా ప్రాముఖ్యత కలిగింది. ఇక్కడ వందల మంది విద్యార్థులు లా విద్యను అభ్యసిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. ఇక్కడ చదివే విద్యార్థినులకు హెచ్ ఎల్ యూ ఓ కీలక విషయం చెప్పింది. ఈ యూనివర్శిటీ విద్యార్థినులకు పీరియడ్స్ లీవ్ విధానాన్ని అములులోకి తెచ్చింది. వచ్చే నెల నుంచి యూనివర్శిటీలో దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొంది. హిదయతుల్లా యూనివర్శిటీలో చేపట్టిన హెల్త్ షీల్డ్ అనే కార్యక్రమంలో భాగంగానే ఈ సెలవు విధానం అమలులోకి తెచ్చినట్లు యూనివర్శిటీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ వీ.సీ. వివేకానందన్ కీలక అంశాలను ప్రస్తావించారు.  విద్యార్థినుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని నెలసరి సెలవుల విధాన్ని అమలు చేయడం ప్రశంసించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఈ నిర్ణయానికి మద్దతిచ్చినందుకు అకాడమిక్ కౌన్సిల్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ఇంకా యూనివర్శిటీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ కొత్త విధానంలో ఇక్కడ చదివే అమ్మాయిలు  నెలలో ఒక రోజు పీరియడ్స్ సెలవు తీసుకోవచ్చని తెలిపారు. అలానే  రాబోయే రోజుల్లో పరీక్షా రోజుల్లో కూడా ఇటువంటి ప్రత్యేక సెలవులు మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. క్రమరహిత నెలసరి సిండ్రోమ్, లేదా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటి రుగ్మతలు ఉన్న అమ్మాయిలు ఒక సెమిస్టర్ లో ఆరు రోజుల వరకూ సెలవులు తీసుకోవచ్చాని యూనివర్శిటి ప్రతినిధులు అన్నారు. గతంలో 2023లో జనవరిలో కేరళలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దేశంలోనే మొట్టమొదటి సారి నెలసరి సెలవుల విధానాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంలో సీఎం పినరయి విజయన్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘రుతుస్రావం సెలవుల నిర్ణయంతో కేరళ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది”  అని తెలిపారు. అనంతరం వివిధ రాష్ట్రాల్లో ఫేమస్ యూనిర్శిటీలు కూడా ఈ విధమైన సెలవు విధానాన్ని ప్రారంభించాయి.  మరి..తాజాగా హిదయతుల్లా లా యూనివర్శిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.