iDreamPost

ఐదేళ్ల ప్రేమ.. పెళ్లైన 15 రోజులకే

అమ్మాయి బాగా చదువుకుంది. మంచి ఉద్యోగం కూడా చేస్తోంది. అంతలో ఒక అతడిని ప్రేమించాను.. పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది. ఆ అబ్బాయితో వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయితే..

అమ్మాయి బాగా చదువుకుంది. మంచి ఉద్యోగం కూడా చేస్తోంది. అంతలో ఒక అతడిని ప్రేమించాను.. పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది. ఆ అబ్బాయితో వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయితే..

ఐదేళ్ల ప్రేమ.. పెళ్లైన 15 రోజులకే

ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వీరి పెళ్లికి కూడా తొలుత పెద్దలు అంగీకరించలేదు. ముఖ్యంగా అమ్మాయి తరుపున తల్లిదండ్రులకు. ప్రియుడితో పెళ్లికి వారు నిరాకరించారు. దీంతో ఆమె ‘నేను అతడినే పెళ్లి చేసుకుంటా. అతడు లేకుండా నేను బతకలేను’ అంటూ పెద్ద పోరాటమే చేసింది. చివరకు కూతురు ఆనందం, సుఖం కోసం తల్లిదండ్రులు ఒప్పుకోక తప్పలేదు. పేరెంట్స్ ఒప్పుకోవడంతో.. అబ్బాయి తరుపు తల్లిదండ్రులతో మాట్లాడటం, కట్నం, కానుకలు అన్నీ చర్చించుకున్నారు. అంగరంగ వైభవంగా కూతురికి పెళ్లి చేశారు. వివాహ తంతు ముగిసింది. అంతలో కూతురు చనిపోయిందంటూ కబురు వెళ్లడంతో తండ్రి షాక్‌తో పాటు కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంతకు ఏం జరిగిందంటే..?

తమిళనాడులోని చెన్నైలోని వినాకపురం వెల్‌మురుగన్ నగర్‌కు చెందిన అనంత రామన్, ఆనంది భార్యా భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె ఇందుజ, కొడుకు మోనీశ్వర్ ఉన్నారు. తండ్రి ఎంతో కష్టపడి పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాడు. ఇటీవల అతడి ఆరోగ్యం కూడా దెబ్బతింది. కూతురు ప్రస్తుతం ఐటి ఇండస్ట్రీలో వర్క్ చేస్తోంది. ఇందుజ పెరంబూర్ ఎస్‌బీఐ కాలనీ 2వ వీధికి చెందిన హరికిరణ్ అనే వ్యక్తిని గత ఐదేళ్లుగా ప్రేమిస్తుంది. ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుని.. పేరెంట్స్‌కు చెప్పారు. అయితే హరి కిరణ్ ను చేసుకోవడం ఇందుజ తండ్రికి ఇష్టం లేదు. తొలుత వద్దన్నారు. కానీ కూతురు పట్టుబట్టడంతో కాదనలేక.. వివాహానికి ఒప్పుకున్నారు.

అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. వివాహమై 15 రోజులు గడిచిపోయింది. ఓ రోజు అల్లుడు హరికిరణ్ ఇందుజ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు.. మీ కూతురు చనిపోయిందంటూ. దీంతో ఒక్కసారిగా షాకైన తల్లిదండ్రులు.. పరుగున ఆసుపత్రికి వెళ్లారు. హరికిరణ్ చెప్పిన దాని ప్రకారం.. ఇంట్లో పని చేస్తుండగా.. ఇందుజ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. ఆసుపత్రికి తీసుకు రాగానే.. మార్గమధ్యంలోనే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పారంటూ తెలిపాడు. అయితే తల్లి ఆనంది.. తన కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేసింది.  ఆమె ఎలా చనిపోయిందో తమకు తెలియాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గారాబంగా పెంచుకున్న కూతురు ఇక లేదని తెలిసి తండ్రి కన్నీరుమున్నీరు అయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె మృతదేహాన్ని పరిశీలించగా.. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని తేలింది. కాగా, విచారణ కొనసాగుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి