iDreamPost

భార్యని స్క్రూడ్రైవర్‌తో 30 సార్లు పొడిచి చంపాడు! అంత కోపం ఎందుకంటే?

పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరి బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు జన్మించారు. భర్త అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కానీ భార్య మాత్రం

పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరి బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు జన్మించారు. భర్త అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కానీ భార్య మాత్రం

భార్యని స్క్రూడ్రైవర్‌తో 30 సార్లు పొడిచి చంపాడు! అంత కోపం ఎందుకంటే?

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని నిరూపితమైతుంది ఈ కలికాలంలో. తనువు, మనస్సును మాత్రమే కాదు, కష్ట నష్టాల్లో సగ భాగాన్ని పంచుకుంటూ జీవిస్తున్న భార్యా భర్తలు సైతం ఇదే డబ్బు కోసం కొట్టుకు చస్తున్నారు. ముఖ్యంగా స్త్రీ ధనంపై భర్తకు ఎనలేని కోరిక పుడుతుంది భర్తకు. పుట్టింటి నుండి వచ్చిన ఆస్తిపై కన్నేస్తున్నాడు. అవి చూసుకుని తన భార్య తనను ఎక్కడ వదిలేస్తుందేమో.. తను బాగా చూసుకోదన్న భయంతో బతుకుతుంటాడు. చివరకు ఆ ఆస్తి పాస్తులు తన పేరు మీద రాయించుకుంటాడు. అంతేనా.. తన సంపాదనలో భార్య ఒక రూపాయి దాచినా, ఏదైనా ఆస్తులు పొగేసినా సహించలేడు. తనతో గొడవ పడి అవన్నీ ఎక్కడ తీసుకెళ్లిపోతుందోనన్న అభద్రతా భావంతో జీవిస్తుంటాడు. ఇదిగో ఇలాంటి ఇగోతోనే భార్యను హతమార్చాడు ఓ అంబులెన్స్ డ్రైవర్.

మీరట్‌లోని భావన్‌పూర్‌లోని జైభీమ్‌నగర్‌లో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న లలిత్ తన భార్య దీప (27)ని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. స్క్రూడ్రైవర్‌తో 30 సార్లు పొడిచి హత్య చేశాడు కిరాతకడు. ఇద్దరు పిల్లల్ని తల్లి లేని అనాథలు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జైభీమ్‌నగర్‌కు చెందిన లలిత్ వర్మకు మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లోని కమల్‌పూర్ గ్రామానికి చెందిన ప్రీతమ్ సింగ్ జాతవ్ కుమార్తె దీపతో పదేళ్ల క్రితం వివాహమైంది. అయితే భార్యకు పుట్టింటి నుండి కొంత సొమ్ము రావడంతో ఓ ప్లాట్ తీసుకుంది. అయితే అప్పటి నుండి ఆమెలో మార్పు చోటుచేసుకుందని భర్త వాదన. ఇద్దరికి గొడవ జరిగినప్పుడల్లా.. నీతో విడిపోయి.. ఈ ప్లాట్ అమ్ముకుని బతుకుతానంటూ భయపెట్టేదని, అలాగే నిత్యం ఫోనులో ఉంటూ ఇన్ స్టా, పేస్ బుక్ చూస్తుండేదని చెబుతున్నాడు.

ఇటీవల ఈ విషయంపైనే గొడవ జరగ్గా.. గాఢ నిద్రలో ఉన్న భార్య దీపను స్క్రూ డ్రైవర్ తీసుకుని మెడ, చాతీ, కడుపుపై దాదాపు 30 సార్లు పొడిగాడు. ఆ సమయంలో దీప కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే సరికి ఆమె అప్పటికే మృతి చెందింది. ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించారు. లలిత్ పారిపోతుండగా.. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, దీప కుటుంబ సభ్యులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లలిత్ తరచూ మద్యం సేవించే వాడని, తన సోదరిని కొట్టేవాడని తెలిపాడు దీప సోదరుడు. అంతే కాకుండా లలిత్ సోదరి సైతం తన తండ్రి నుండి రూ. 20 వేలు డిమాండ్ చేసిందని, ఇవ్వకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని చెబుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి