iDreamPost

స్నేహితుల దారుణం.. విద్యార్థిని కిడ్నాప్ చేసి..

చిన్న నాటి స్నేహం చాలా అపురూపంగా, స్మరణీయంగా ఉంటుంది. ఇక కాలేజీ దశకొచ్చేసరికి కాస్త ఈగోలు ఉన్నా.. కాసేపే ఉంటాయి. మళ్లీ కలిసి పోతుంటారు. మంచి స్నేహితులు అవుతుంటారు. కానీ ఇతడికి మాత్రం.. అదే స్నేహితుల నుండి..

చిన్న నాటి స్నేహం చాలా అపురూపంగా, స్మరణీయంగా ఉంటుంది. ఇక కాలేజీ దశకొచ్చేసరికి కాస్త ఈగోలు ఉన్నా.. కాసేపే ఉంటాయి. మళ్లీ కలిసి పోతుంటారు. మంచి స్నేహితులు అవుతుంటారు. కానీ ఇతడికి మాత్రం.. అదే స్నేహితుల నుండి..

స్నేహితుల దారుణం.. విద్యార్థిని కిడ్నాప్ చేసి..

మనిషి జీవితంలో అందమైన దశలు బాల్యం,యవ్వనం. ఈ దశల్లో వారి జీవితాల్లో జరిగే ఆనంద, విషాద సంఘటనలు మనస్సుపై జీవితకాలం ముద్ర వేస్తుంటాయి. ముఖ్యంగా ఇంటర్, డిగ్రీ స్థాయిలో భవిష్యత్తుపై ఎన్నో కలలుకంటుంటారు. ఆ కలలను పంచుకునేది కేవలం తమ స్నేహితులతోనే. అప్పటి వరకు తమ లైఫ్‌లో జరిగిన, జరుగుతున్న ప్రతి విషయాన్ని స్నేహితులతోనే షేర్ చేసుకుంటారు. అలాంటిది ఫ్రెండ్సే పగబట్టినట్లు చేస్తే.. టార్గెట్ చేస్తూ హింసించి, అవమానించి, వేధిస్తే.. ఇక ఎవ్వరికి ఆ బాధ చెప్పుకోవాలో అర్థం కాదు. తాజాగా అటువంటి సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తోటి స్నేహితులే ఓ యువకుడి పట్ల విచక్షణా రహితంగా ప్రవర్తించారు.

వివరాల్లోకి వెళితే.. మీరట్‌లోని కేఎల్ ఇంటర్నేషనల్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఈ నెల 13న తోటి విద్యార్థులు కిడ్నాప్ చేసి.. ఓ ప్రాంతానికి తీసుకెళ్లి.. ఇష్టమొచ్చినట్లు కొట్టడమే కాకుండా.. మూత్ర విసర్జన కూడా చేశారు. తనను కొట్టవద్దని విద్యార్థి ఎంత బలిమాలాడినా వినలేదు. అతడి తలపై, వీపుపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం ముఖంపై మూత్ర విసర్జన చేశారు. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోను బాధితుడి కుటుంబ సభ్యులు కూడా పంపి తమ పైశాచిక ఆనందాన్ని ప్రదర్శించుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎనర్జీ కార్పొరేషన్‌కు చెందిన లైన్ మెన్ కుమారుడు మిఠాయిలు పంచేందుకు ఇంటి నుండి బయటకు వచ్చాడు.

అంతలో కొంత మంది యువకుల గుంపు వచ్చి.. అతడ్ని అక్కడి నుండి అతడిని ఎత్తుకెళ్లి.. నిర్జన ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అతడిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. నేలపై పడేసి ఇష్టమొచ్చినట్లు కొడుతూనే ఉన్నారు. అంతేకాకుండా అతడిపై మూత్ర విసర్జన చేశారు. వీడియో తీసి అతడని బ్లాక్ మెయిల్ చేస్తూ, డబ్బులు కూడా వసూలు చేశారు.  ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనలో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బయటకు వెళ్లిన కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో రాత్రంతా ఎదురు చూశామని, పలువుర్ని అడిగినా చెప్పలేదన్నారు. మరుసటి రోజు బాధితుడు ఇంటికి చేరుకోవడంతో విషయం వెలుగుచూసింది. ఆ ఏడుగురిలో నలుగుర్ని ఆశిష్, అవిశర్మ, రాజన్, మెహిత్ ఠాకూర్‌గా గుర్తించారు. దాడి చేసిన వారిలో స్నేహితులు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి