iDreamPost

త్రీ స్టార్స్ సంక్రాంతి యుద్ధం – ఫ్లాష్ బ్యాక్ – Nostalgia

త్రీ స్టార్స్ సంక్రాంతి యుద్ధం – ఫ్లాష్ బ్యాక్ – Nostalgia

ఇప్పుడు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరుల మధ్య సంక్రాంతి పోటీ చూస్తుంటే టాలీవుడ్ కు రాను రాను సంక్రాంతి ఎంత కీలకంగా మారుతోందో అర్థమవుతోంది. అయితే ఇలాంటి పోటీ ఇప్పటిది కాదు. ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటి మహేష్ బాబు జమానా దాకా ఇది ఇలాగే కొనసాగుతోంది కాని సమఉజ్జీలు అనదగ్గ హీరోలు సై అంటే సై అంటూ సవాల్ విసురుకోవడం ప్రతిసారి జరగదు. అలాంటి ఆసక్తికరమైన సందర్భం 2001లో వచ్చింది.

ఆ సంవత్సరం ముగ్గురు అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ బాక్స్ ఆఫీస్ బరిలో పోటీ పడేందుకు నిర్ణయించుకున్నారు.జనవరి 11న భారీ బడ్జెట్ తో రూపొందిన మృగరాజు డేట్ ని ఫిక్స్ చేస్తే అదే తేదికి నరసింహనాయుడు కూడా అనౌన్స్ చేశారు. ఇంకేముంది బయ్యర్ల మధ్య విపరీతమైన పోటీ. ఇవి చాలవు అన్నట్టు కేవలం నాలుగు రోజుల గ్యాప్ తో 15న సోషియో ఫాంటసీ దేవి పుత్రుడు కూడా రేస్ లోకి వచ్చింది. చిరంజీవి ఆ టైంలో మంచి ఫాం లో ఉన్నారు. అన్నయ్య సూపర్ హిట్ కావడంతో దాని తర్వాత సినిమాగా దీని మీద అంచనాలు పెరిగిపోయాయి.

మరోవైపు నాలుగు ఫ్లాపుల తర్వాత బాలయ్యకు నరసింహనాయుడు వస్తోంది. ఈ ఇద్దరి కంటే ఎక్కువ జోష్ తో కలిసుందాం రా, జయం మనదేరా లాంటి బ్లాక్ బస్టర్స్ తో వెంకీ పిచ్చ సక్సెస్ లో ఉన్నాడు. రానే వచ్చింది సంక్రాంతి సీజన్. మృగరాజు దారుణంగా బోల్తా కొట్టగా దేవిపుత్రుడు అంచనాలు అందుకోలేక రన్ అవుట్ అయ్యింది. ఇక నరసింహనాయుడు రికార్డుల భరతం పడుతూ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. మూడు సినిమాలకు మణిశర్మ అందించిన సంగీతం అప్పట్లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ. కాని ఫలితం మాత్రం ఒక్కదానికే అనుకూలంగా వచ్చింది. ఫాం పరంగా హిట్స్ లో ఉన్న చిరు వెంకీలకు సంక్రాంతి హ్యండ్ ఇవ్వగా హిట్ కోసం ఎదురు చూస్తున్న బాలకృష్ణకు ఏకంగా టాప్ గ్రాసర్ దక్కడం విశేషం. అందుకే సినిమా సంక్రాంతి ప్రతి ఏడాది ఇలాంటి విశేషాలు ఏవో ఒకటి తెస్తూనే ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి