iDreamPost
android-app
ios-app

మెగాస్టార్-రామ్ చరణ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

  • Published Jul 23, 2024 | 11:42 AM Updated Updated Jul 23, 2024 | 11:42 AM

Chiranjeevi-Ram Charan Sentiment Repeate: టాలీవుడ్ లో ఓ ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ రిపీట్ కాబోతోంది. ఇందుకోసం మెగాఫ్యాన్స్ ఈగర్లి వెయిట్ చేస్తున్నారు. మరి ఆ సెంటిమెంట్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

Chiranjeevi-Ram Charan Sentiment Repeate: టాలీవుడ్ లో ఓ ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ రిపీట్ కాబోతోంది. ఇందుకోసం మెగాఫ్యాన్స్ ఈగర్లి వెయిట్ చేస్తున్నారు. మరి ఆ సెంటిమెంట్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

మెగాస్టార్-రామ్ చరణ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

ఇండస్ట్రీలోనే కాదు.. ఏ రంగంలోనైనా వివిధ రకాల సెంటిమెంట్స్ ఉంటాయి. అయితే ఈ సెంటిమెంట్స్ సినీ పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాల జోరు మెుదలైందనే చెప్పాలి. ఆగస్ట్ నుంచి వరుసబెట్టి మూవీస్ రిలీజ్ లకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుందా? అంటూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అవును మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ గత సెంటిమెంట్ రిపీట్ అవ్వాలని కోరుకుంటున్నారు. మరి ఆ సెంటిమెంట్ ఏంటి? చూద్దాం పదండి.

బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాలు తక్కువ గ్యాప్ లో విడుదల కావడం సాధారణమే. అయితే అవి తండ్రీ కొడుకుల సినిమాలు కావడం మాత్రం చాలా అరుదుగా జరిగే సంఘటన. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇలాంటి అరుదైన సీన్ రిపీట్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ ల చిత్రాలు నెల గ్యాప్ లోనే వస్తున్నాయి. గతంలో 2016లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ధృవ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ కాగా.. 2017 సంక్రాంతికి చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి.

కాగా.. ఇప్పుడు మరోసారి ఈ తండ్రీకొడుకుల ఇదే సెంటిమెంట్ ను రిపీట్ చేయడానికి సిద్ధమైయ్యారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ క్రిస్మస్ కానుకగా రాబోతోందని నిర్మాత దిల్ రాజు అనౌన్స్ చేశారు. మరోవైపు సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘విశ్వంభర’ మూవీతో చిరు వస్తున్నాడు. బింబిసార డైరెక్టర్ వశిష్ట ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. దాంతో ఒక్కసారి గతం గుర్తుకు చేసుకుంటున్న మెగాఫ్యాన్స్.. సెంటిమెంట్ రిపీట్ కావాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి మెగా అభిమానులు కోరుకునే విధంగా సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? లేదా? అన్నది.