iDreamPost
android-app
ios-app

Chiranjeevi: మెగాస్టార్ నిర్ణయంతో టెన్షన్ లో ఫ్యాన్స్! అసలు విషయం ఏంటంటే?

  • Published Jul 24, 2024 | 3:50 PM Updated Updated Jul 24, 2024 | 3:50 PM

విశ్వంభర మూవీ తర్వాత చిరు ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో మెగాస్టార్ తీసుకున్న నిర్ణయం ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

విశ్వంభర మూవీ తర్వాత చిరు ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో మెగాస్టార్ తీసుకున్న నిర్ణయం ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 24, 2024 | 3:50 PMUpdated Jul 24, 2024 | 3:50 PM
Chiranjeevi: మెగాస్టార్ నిర్ణయంతో టెన్షన్ లో ఫ్యాన్స్! అసలు విషయం ఏంటంటే?

మెగాస్టార్ చిరంజీవి.. సెకండ్ ఇన్నింగ్స్  ప్రారంభించిన తర్వాత కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తన దగ్గరికి వచ్చిన కథలను కాకుండా.. తనకు నచ్చిన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్టతో ‘విశ్వంభర’ అనే మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ మూవీ జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక ఈ మూవీ తర్వాత చిరూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో మెగాస్టార్ తీసుకున్న నిర్ణయం ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్ బట్టే సినిమాకు క్రేజ్ వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే.. కొన్నిసార్లు ఊహించిన తొలి కాంబోలు సూపర్ డూపర్ హిట్స్ కొడతాయి. దాంతో వారికి స్టార్ హీరోలు ఛాన్స్ లు ఇస్తుంటారు. ప్రస్తుతం మెగాస్టార్ అదే చేశారు. బింబిసార మూవీతో హిట్ కొట్టిన వశిష్టకు విశ్వంభర అవకాశం ఇచ్చారు. వశిష్టకు ఇది రెండో చిత్రం మాత్రమే. అతడికి డైరెక్టర్ గా అనుభం తక్కువ. కానీ చిరు ఇవేమీ పట్టించుకోవడం లేదు. టాలెంట్ ను మాత్రమే లెక్కలోకి తీసుకుంటూ తన సినిమాల డైరెక్టర్లను ఎంపిక చేసుకుంటున్నాడు. విశ్వంభర తర్వాత తనతో ‘గాడ్ ఫాదర్’ తీసిన డైరెక్టర్ మోహన్ రాజాతో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ మూవీకి స్టార్ రైటర్ బీవీఎస్ రవి కథను అందించారు. మెగాస్టార్ కూతురే  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే.. తనతో లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ తీసిన మోహన్ రాజాతో చిరూ నెక్ట్స్ మూవీ చేస్తుండటంతో.. ఫ్యాన్స్ లో కంగారు మెుదలైంది. ఎందుకంటే? గాడ్ ఫాదర్ యావరేజ్ గా నిలిచింది. ఇలాంటి డైరెక్టర్ కు మళ్లీ ఛాన్స్ ఇచ్చి తమ హీరో రిస్క్ చేస్తున్నాడా? అని టెన్షన్ పడుతున్నారు చిరు ఫ్యాన్స్. ఇక మెగాస్టార్ కోసం కథలు సిద్ధం చేసుకుని మారుతి, హరీష్ శంకర్, అనుదీప్, తమిళ డైరెక్టర్ హరి ఎదురుచూస్తున్నారు. వీరిని కాదని తనకు యావరేజ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో సినిమా చేస్తుండటం ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom