iDreamPost
android-app
ios-app

Jai Hanuman: ప్రశాంత్ వర్మ మెగా ప్లానింగ్! కానీ.. ఆయన నిర్ణయమే కీలకం..

  • Published Jul 25, 2024 | 11:03 AM Updated Updated Jul 25, 2024 | 11:03 AM

ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీ కోసం మెగా ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అది అంత సులభమైంది కాదు. ఆయన ఓకే అంటేనే జై హనుమాన్ ముందుకెళ్తుందట. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీ కోసం మెగా ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అది అంత సులభమైంది కాదు. ఆయన ఓకే అంటేనే జై హనుమాన్ ముందుకెళ్తుందట. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Jul 25, 2024 | 11:03 AMUpdated Jul 25, 2024 | 11:03 AM
Jai Hanuman: ప్రశాంత్ వర్మ మెగా ప్లానింగ్! కానీ.. ఆయన నిర్ణయమే కీలకం..

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అంతకు ముందే రాజశేఖర్ తో కల్కి, తేజ సజ్జతో జాంబిరెడ్డి చిత్రాలతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ఇక హనుమాన్ తో ఏకంగా పాన్ ఇండియా హిట్ ను అందుకున్నాడు. 2024లో వచ్చి అతిపెద్ద హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో ఈ మూవీ నిలిచింది. కాగా.. హనుమాన్ సీక్వెల్ అయిన జై హనుమాన్ గురించి స్టార్టింగ్ లో అప్డేట్స్ ఇచ్చాడు డైరెక్టర్. కానీ ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ  మెగా ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అది అంత సులభమైంది కాదు. ఆయన ఓకే అంటేనే జై హనుమాన్ ముందుకెళ్తుందట.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీకి సీక్వెల్ అయిన జై హనుమాన్ ఎప్పుడు మెుదలౌతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి పెద్ద చిక్కుముడి ఇంకా వీడలేదు. అదేంటంటే? జై హనుమాన్ లో హనుమాన్ క్యారెక్టర్ కోసం ఎవరిని తీసుకోవాలి? ఇప్పుడు ఇదే ప్రశాంత్ ముందున్న పెద్ద టార్గెట్. అయితే ఈ యంగ్ డైెరెక్టర్ మాత్రం హనుమాన్ పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిని తీసుకోవాలని అనుకుంటున్నాడట. సీక్వెల్ మెుత్తం హనుమంతుడి పాత్ర మీదే ఎక్కువ ఉంటుంది కాబట్టి.. దాని కోసం కచ్చితంగా స్టార్ హీరోనే తీసుకోవాలి.

ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ ఈ పాత్రకు మెగాస్టార్ అయితేనే న్యాయం చేయగలడని భావిస్తున్నట్లు సమాచారం. కానీ ఇదంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే? చిరు ఇప్పుడు విశ్వంభర చేస్తున్నాడు. ఆ తర్వాత గాడ్ ఫాదర్ తీసిన డైరెక్టర్ మోహన్ రాజాతో మరో మూవీని చేయబోతున్నాడు. విశ్వంభర కంప్లీట్ అవ్వగానే దాదాపు ఈ చిత్రమే పట్టాలెక్కనున్నట్లు సమాచారం. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే? జై హనుమాన్ మూవీ స్టోరీ నచ్చితే చిరు ఒకే చెప్పినా ఆశ్చర్యం లేదు. ఇక తమ ఇంటి దైవం పాత్ర చేయమంటే మెగాస్టార్ ఏ మేరకు సుముఖంగా ఉంటాడనేది ఆలోచించాల్సిన అంశం.

ఇదిలా ఉండగా లేటెస్ట్ గా హనుమాన్ నిర్మాత చైతన్య రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. హనుమాన్ క్యారెక్టర్ కోసం చిరంజీవి లేదా రామ్ చరణ్ ను ఊహించుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. దాంతో జై హనుమాన్ టీమ్ మెగాస్టార్ ను ఒప్పించేందుకు బలంగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. గతంలో ఓసారి హనుమంతుడి పాత్రలో కనిపించాడు చిరు. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో కొన్ని నిమిషాలు హనుమాన్ పాత్రలో మెరిశాడు. చూడాలి మరి హనుమాన్ క్యారెక్టర్ వేసే ఆ స్టార్ హీరో ఎవరు?

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş