iDreamPost

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? మారుతి సుజుకి కారుపై 1 లక్ష డిస్కౌంట్.. త్వరపడండి

కొత్త కారు కొనాలనుకునే వారికి బిగ్ డీల్ అందుబాటులో ఉంది. మారుతి సుజుకి కారుపై భారీ తగ్గింపు ఇస్తోంది. ఏకంగా లక్ష రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. త్వరపడండి.

కొత్త కారు కొనాలనుకునే వారికి బిగ్ డీల్ అందుబాటులో ఉంది. మారుతి సుజుకి కారుపై భారీ తగ్గింపు ఇస్తోంది. ఏకంగా లక్ష రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. త్వరపడండి.

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? మారుతి సుజుకి కారుపై 1 లక్ష డిస్కౌంట్.. త్వరపడండి

ఈ రోజుల్లో సొంత వెహికిల్ ఉండాలనుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. సొంత బైక్, కారు ఉండాలని కోరుకుంటున్నారు. అయితే బైక్ కంటే కారుంటే ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సొంత కారులో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే కారు కొనాలంటే లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కార్లపై ఆఫర్లు లభిస్తే బాగుండు అని ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో కార్ల తయారీ కంపెనీలు సేల్స్ పెంచుకునేందుకు తమ మోడల్ కార్లపై ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. మరి మీరు కూడా కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే మంచి డీల్ అందుబాటులో ఉంది. మారుతీ సుజుకీ కారుపై ఏకంగా లక్ష రూపాయల డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

మార్కెట్ లో పోటీని తట్టుకుని టాప్ లో కొనసాగేందుకు ఆటో మొబైల్ కంపెనీలు కస్టమర్లకు అందుబాటు ధరల్లో కార్లను విక్రయించేందుకు రెడీ అవుతున్నాయి. కార్లపై అదిరిపోయే డీల్స్, డిస్కౌంట్స్ ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌, నెక్సా డీలర్‌షిప్స్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా కారుపై ఏకంగా లక్ష రూపాయల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. కొన్ని రోజుల వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నది. మీరు న్యూ కార్ కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే త్వరపడండి. లక్ష రూపాయాలు ఆదా చేసుకోవచ్చు.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీని ప్రమోట్ చేసే క్రమంలో వేరియంట్ ను బట్టి కస్టమర్లు రూ.14 వేల నుంచి రూ.1.04 వరకు డిస్కౌంట్ పొందవచ్చని తెలిపింది. జూన్ 30 వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం భారత మార్కెట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా రూ.10.99 – రూ.19.93 లక్షల(ఎక్స్ షోరూం) మధ్య లభిస్తోంది. ఈ వెహికిల్‌లో సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా అనే నాలుగు వేరియంట్లు ఉన్నాయి. తాజాగా ప్రకటించిన డిస్కౌంట్లలో సీఎన్‌జీ వెహికిల్‌పై రూ.14 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇక, సిగ్మా వేరియంట్‌పై రూ.34 వేలు, మిగతా వేరియంట్స్‌పై రూ.64 వేల వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి