iDreamPost

ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్.. మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

  • Published Jun 25, 2024 | 6:39 PMUpdated Jun 25, 2024 | 6:39 PM

ఇటీవలే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ స్వియ దర్శకత్వంలో ఎమర్జెన్సీ అనే చిత్రంలో నటించింది. కాగా,  ఈ చిత్రానికి కంగనానే  నిర్మాతగా  కూడా వ్యవహరిస్తుంది. ఇకపోతే ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమాను తీయనున్నారు. అయితే ఎన్నికల కారణంగా విడుదల నిలిపివేసిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు.

‘కంగనా రనౌత్’.. ఈ పేరు ప్రేక్షకులకు, సోషల్ మీడియా యూజర్స్ అందరికీ సుపరిచితమే.అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కంగనా కూడా ఒకరు. అలాగే దర్శకురాలుగా, ఫైర్ బ్రాండ్ గా కంగనాకు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కాగా, ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు పేరు తరుచు సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ మధ్యనే ఈ బ్యూటీ బీజేపీ ఎంపీగా సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందింది. ఇక ఇన్నాళ్లుగా ఒక నటిగా, దర్శకురాలిగా, అటూ వివాదస్పదంగా అందరీ దృష్టిని ఆకర్షించిన కంగనా ఇకపై ఎంపీగా ప్రజలకు సేవ చేయనుంది.

ఇదిలా ఉంటే.. కంగనా ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఇందిరా గాంధీ బయోపిక్ లో నటించిన విషయం తెలిసిందే. కాగా, ఆ మూవీకి ‘ఎమర్జెన్సీ’ అని టైటిల్ ను కూడా ఖరారు చేశారు.అయితే ఎన్నికల కారణంగా ఈ సినిమా థియేటర్ రిలీజ్ కు వాయిదా పడిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ పై అధికారక ప్రకటన వచ్చేసింది. ముఖ్యంగా కంగనానే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఆఫిషియల్ గా ప్రకటన చేసింది. ఇంతకి ఎప్పుడంటే..

ఇటీవలే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ స్వియ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ అనే చిత్రంలో నటించింది. కాగా,  ఈ చిత్రానికి కంగనానే  నిర్మాతగా  కూడా వ్యవహరిస్తుంది. ఇకపోతే ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమాను తీయనున్నారు. పైగా ఈ చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కంగనానే పోషిస్తున్నారు. అయితే విడుదలపై రకరకాల వార్తలు వినిపించాయి. కానీ, ఆ తర్వాత ఎన్నికల హడవిడిలో ఈ సినిమా విడుదలను నిలిపి వేశారు. కానీ, తాజాగా ఈ సినిమా ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. పైగా స్వయనా కంగనానే ఈ సినిమా రిలీజ్ ఆఫిషియల్ డేట్ ను ప్రకటించింది.

అయితే భారత రాజ్యాంగంలో చీకటి అధ్యాయం గా పేరొందిన ఎమర్జెన్సీ రోజును సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు కంగనా తాజాగా ప్రకటించారు. ఇకపోతే గతంలో కంగనా రనౌత్ గత కొన్ని సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి పరాజయం పాలయ్యాయి. ఈ సినిమా ద్వారా కంగనా మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తుందని అంటున్నారు. అలాగే, బీజేపీ ఎంపీగా కంగనా ఇందిరాగాంధీని, ఎమర్జెన్సీని తెరపై ఎలా చిత్రీకరిస్తుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కూడా నెలకొంది. చాలా నెలల క్రితం ఈ సినిమా చిన్న టీజర్ విడుదలైంది. అయితే టీజర్‌లో కంగనా రనౌత్ నటన అద్భుతంగా ఉంది. ఆ ఒక్క చిన్న టీజర్ నుంచే సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది. ఇక త్వరలోనే ఎమర్జెన్సీ  ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి