iDreamPost

స్టూడెంట్స్ చేసిన పనికి లెక్చరర్స్ ఫిదా.. భావోద్వేగానికి

మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత గౌరవించేది గురువులనే. విద్యా బుద్దులు నేర్పే ఉపాధ్యాయులు పట్ల విద్యార్థులకు ఉన్న ప్రేమ చూపించాలంటే.. టీచర్స్ డేలాంటివి సరిపోవు..

మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత గౌరవించేది గురువులనే. విద్యా బుద్దులు నేర్పే ఉపాధ్యాయులు పట్ల విద్యార్థులకు ఉన్న ప్రేమ చూపించాలంటే.. టీచర్స్ డేలాంటివి సరిపోవు..

స్టూడెంట్స్ చేసిన పనికి లెక్చరర్స్ ఫిదా.. భావోద్వేగానికి

తల్లిదండ్రులు పిల్లల్ని కనిపించితే.. వారిని సన్మార్గంలో నడిపించేది మాత్రం గురువులే. అందుకే తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుకు దక్కుతుంది. జీవితంలో చదువు ఎంత ముఖ్యమో చెబుతూనే.. విద్యార్థులను ఉన్నత స్థానాల వైపు వెళ్లేలా తీర్చిదిద్దుతూ ఉంటారు. కేవలం పాఠాలతోనే సరిపెట్టరు.. అంతకు మించిన లోక జ్ఞానాన్ని, నడత, నడవడికను నేర్పిస్తారు. వక్రమార్గంలో నడుస్తున్న పిల్లలను నయాన్నో, భయాన్నో నచ్చజెప్పి.. వారిని మంచి మార్గంలో నడిచేలా మలుస్తుంటారు. భవిష్యత్తులో సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోగలిగినా,సక్సెస్ అయిన నాడు ముందుగా గుర్తుకువచ్చేది.. ఉపాధ్యాయులే. అధ్యాపకులు, విద్యార్థుల మధ్య ఉండే బాండింగ్ చాలా డిఫరెంట్.

తమ ఫేవరేట్ టీచర్ ఎవరైనా రిటైర్డ్ అయినా, మరో చోటికి ట్రాన్స్ ఫర్ అవుతున్నా.. కన్నీరు మున్నీరు అయ్యే విద్యార్థులను చూశారు. ఇప్పుడు ఉపాధ్యాయురాలి పట్ల స్టూడెంట్స్ చేసిన పనికి ప్రతి ఒక్కరు ఫిదా కావాల్సిందే. ఈ టీచర్ కూడా పిల్లలు చేసిన పనికి మెస్మరైజ్ అయ్యారనుకోండి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇంతకు ఏం జరిగిందంటే.. గర్భిణీగా ఉన్న పంతులమ్మకు తాము చదువుతున్న విద్యా సంస్థల్లోనే శ్రీమంతం చేసి వారిని ఎనలేని ఆనందంలో నింపారు. ఈ  సంఘటన కేరళలో చోటుచేసుకోవడం విశేషం. ఈ వీడియోలో అచ్చమైన సాంప్రదాయమైన పద్ధతిలో శ్రీమంతం వేడుక జరిగింది.. ఉపాధ్యాయురాలు సర్ ప్రైజ్ కావడంతో పాటు ఎమోషనల్ అయ్యారు.

చాలా సస్పెన్స్‌గా శ్రీమంతం వేడుకలను ఏర్పాటు చేసి.. సడెన్ సర్పైజ్ ఇచ్చారు. పర్యావరణ హితంగా ఈ వేడుక జరిగింది. అరిటాకులు, మామిడి, బంతిపూలతో అందంగా డెకరేట్ చేసి.. ఆ తర్వాత మేడమ్‌ను పిలిచారు. ఒక్క సారిగా షాకైన ఆమె.. వెంటనే రూంలోకి వెళ్లారు. అంతలో అక్కడ ఉన్న విద్యార్థులు డ్యాన్సులు చేసి.. టీచర్‌ను ఆశ్చర్యానికి గురి చేశారు. వెంటనే శ్రీమంతం వేడుకను చేశారు. తోటి లెక్చరర్స్ ఆమెకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ వీడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే మరో వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆ మేడమ్ అయితే.. పట్టరాన్ని ఆనందంలో మునిగి తేలారు. అస్సలు ఆమె ఊహించలేదు. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. యానివర్సిరీ అంటూ పిలిచి.. ఆమెకు బేబీ షోవర్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ రెండు వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Galatta Media (@galattadotcom)

 

View this post on Instagram

 

A post shared by MLT ‘2020_24 (@_perfect__okay_)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి