Dharani
Kerala Temple Priest Wins Rs 1 Crore in Lottery: 20 ఏళ్లుగా దైవ సేవలో ఉన్న పూజారిని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. ఏకంగా కోటీ రూపాయలు గెలుచుకున్నాడు. ఆ వివరాలు..
Kerala Temple Priest Wins Rs 1 Crore in Lottery: 20 ఏళ్లుగా దైవ సేవలో ఉన్న పూజారిని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. ఏకంగా కోటీ రూపాయలు గెలుచుకున్నాడు. ఆ వివరాలు..
Dharani
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. కావాల్సిందల్లా ఓపిక. మన పని మనం చేసుకుంటూ.. దేవుడి మీద భారం వేసి.. జీవితంలో ముందుకు సాగాలి. ఏదో ఒక రోజు అదృష్టం కలిసి వస్తుంది. అలా అని చెప్పి తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించాలని అనుకోకూడదు. ఇక ఈ మధ్య కాలంలో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతున్న వారి గురించి తరచుగా వార్తలు చదువుతున్నాం. వారందరి అదృష్టానికి కారణం లాటరీ. అవును మన దేశంలోనే కాక ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన వారికి సైతం లాటరీలు తగిలి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో ఓ పూజారి చేరాడు. 20 ఏళ్లుగా దైవ సేవలో ఉంటున్న ఆయన్ని ఇన్నాళ్లకి అదృష్టం వరించింది. లాటరీలో ఏకంగా కోటి రూపాయలు గెలిచారు. ఆ వివరాలు..
ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. కేరళ, ఇడుక్కి జిల్లా, కట్టప్పనకు చెందిన మధుసూదన్ అనే వ్యక్తి.. గత 20 ఏళ్లుగా స్థానికంగా ఉన్న మెప్పారా ఆలయంలో ప్రధాన పూజారిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రంలో నిర్వహించిన 50 50 లాటరీలో ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. అతడి టికెట్ నంబర్ వచ్చేసి ఎఫ్‌టీ506060. కృష్ణ ఏజెన్సీ దగ్గర ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అది అతడి దశను మార్చింది. ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నాడు.
అయితే మధుసూదన్ తరచుగా లాటరీ టికెట్లు కొనేవాడు. ఈ సారి అదృష్టం అతడిని వరించింది. గతంలో ఒక్కసారి చాలా తక్కువ ఎమౌంట్ విన్ అయ్యాడు. మరో సారి వెంట్రుక వాసిలో అనగా ఒక్క నంబర్ తేడాతో 70 లక్షలు గెలుపొందే అవకాశం కోల్పోయాడు. అయినా పట్టువదలకుండా ప్రయత్నించడంతో.. ఈసారి ఏకంగా కోటి రూపాయలు గెలుపొందాడు. ఇక మధుసూదన్ కుటుంబం విషయానికి వస్తే.. ఆయన భార్య అధిరా, ఇద్దరు పిల్లలు వైష్ణవ్, వైగలక్ష్మి ఉన్నారు. ఇక మధుసూదన్‌కు లాటరీలో కోటి రూపాయలు రావడంతో.. భక్తులు అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇన్నాళ్లు దైవ సేవ చేసిందుకు.. ఆ భగవంతుడు ఇలా ఆశీర్వదించాడని అంటున్నారు. అతడి అదృష్టాన్ని పొగుడుతున్నారు. స్థానికులు సైతం అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.