iDreamPost

T20 World Cup 2024: ఆఫ్గాన్ పై ఆసీస్ ఓటమితో మారిన సెమీస్ లెక్కలు! ఇండియాకి ఇక తిరుగులేదు!

ఆఫ్గానిస్తాన్ చేతిలో ఊహించని విధంగా ఆస్ట్రేలియా ఓడిపోవడంతో.. గ్రూప్ 1లో ఒక్కసారిగా సెమీస్ లెక్కలు మారిపోయాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆఫ్గానిస్తాన్ చేతిలో ఊహించని విధంగా ఆస్ట్రేలియా ఓడిపోవడంతో.. గ్రూప్ 1లో ఒక్కసారిగా సెమీస్ లెక్కలు మారిపోయాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

T20 World Cup 2024: ఆఫ్గాన్ పై ఆసీస్ ఓటమితో మారిన సెమీస్ లెక్కలు! ఇండియాకి ఇక తిరుగులేదు!

టీ20 వరల్డ్ కప్ 2024లో చిన్న జట్లు సంచలన ప్రదర్శనతో పెద్ద జట్లకు షాకిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆఫ్గానిస్తాన్ ఈ టోర్నీలో అదరగొడుతోంది. గ్రూప్ స్టేజ్ లో న్యూజిలాండ్ ను ఓడించిన ఆ టీమ్.. ఇప్పుడు కంగారూలను కంగుతినిపించింది. ఇండియాపై ఓటమి తర్వాత గొప్పగా పుంజుకున్న ఆఫ్గాన్.. ఆసీస్ ను 21 రన్స్ తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ విజయంతో తమ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది ఆఫ్గానిస్తాన్. అయితే ఈ విజయంతో సెమీస్ లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. రెండు విజయాలతో టీమిండియా సెమీస్ కు వెళ్లింది. మరి ఇంకో బెర్త్ కోసం ఆసీస్, ఆఫ్గాన్ పోటీ పడుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. పటిష్టమైన ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో చిత్తు చేసింది ఆఫ్గానిస్తాన్. దాంతో సెమీస్ లెక్కలు మారిపోయాయి. గ్రూప్ 1 లో ఇండియా, ఆఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇక ఇప్పటికే ఇండియా ఆడిన రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి.. దాదాపు సెమీస్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. సూపర్ 8లో తన చివరి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో ఆడనుంది భారత్. ఈ మ్యాచ్ లో గెలిస్తే.. దర్జాగా సెమీస్ చేరుతుంది టీమిండియా. ఇక రెండో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, ఆఫ్గాన్ ల మధ్య రసవత్తరమైన పోరు సాగనుంది. ఒకే ఒక్క మ్యాచ్ గ్రూప్ 1లో సెమీస్ లెక్కలను మార్చివేసింది. ఆసీస్ సెమీస్ చేరాలంటే.. ఇండియాపై గెలవాలి. అలాగే ఆఫ్గాన్ సెమీస్ చేరాలంటే బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో గెలిచి.. మరోవైపు ఇండియా చేతిలో ఆసీస్ ఓడిపోవాలి. ఇలా జరిగితే ఇండియా, ఆఫ్గాన్ లు సెమీస్ చేరుతాయి.

Aus vs IND

సూపర్ 8లో ఆస్ట్రేలియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు ఆడగా.. అందులో ఒక మ్యాచ్ లో గెలిచి.. మరో మ్యాచ్ లో ఓడిపోయింది. ప్రస్తుతం 2 పాయింట్లతో రెండో ప్లేస్ లో ఉంది. మరోవైపు ఆఫ్గాన్ కూడా 2 పాయింట్లతో సెమీస్ రేసులోనే ఉంది. బంగ్లాతో జరిగే మ్యాచ్ లో ఆఫ్గానిస్తాన్ గెలిస్తే.. మరోవైపు ఇండియా చేతిలో ఆసీస్ ఓడిపోతే.. ఆఫ్గాన్ సెమీస్ కు వెళ్లడం ఖాయం. ఇక బంగ్లాదేశ్ రెండు మ్యాచుల్లో కూడా ఓడిపోయి.. సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. చివరి మ్యాచ్ లో విజయం సాధించినా.. ఆ టీమ్ కు పెద్దగా ఉపయోగం లేదు కానీ.. పోతూ పోతూ ఆఫ్గాన్ ను ఇంటికి తీసుకెళ్తుంది అంతే. ఇక గ్రూప్ 2లో సౌతాఫ్రికా రెండు విజయాలతో సెమీస్ బెర్త్ ను దాదాపు ఖరారు చేసుకుంది. ఇక మరో స్థానం కోసం వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు పోటీ పడుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి