iDreamPost

Chandini Chowdary : నేను చదివిన కాలేజ్ లో దారుణమైన పరిస్థితులు చూశాను : చాందిని చౌదరి

  • Published Jun 12, 2024 | 3:43 PMUpdated Jun 12, 2024 | 3:43 PM

ఇండస్ట్రీలో ఉన్న కాంపిటీషన్ ను నెగ్గుకుంటూ.. ఓ మంచి స్థాయిలో నిలబడాలి అంటే మాటలు కాదు. అందులో తెలుగు హీరోయిన్స్ కు ఇదొక పెద్ద టాస్క్ అని చెప్పి తీరాలి. ఈ క్రమంలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఓ మంచి స్థాయిలో నిలిచింది ఈ తెలుగు భామ.

ఇండస్ట్రీలో ఉన్న కాంపిటీషన్ ను నెగ్గుకుంటూ.. ఓ మంచి స్థాయిలో నిలబడాలి అంటే మాటలు కాదు. అందులో తెలుగు హీరోయిన్స్ కు ఇదొక పెద్ద టాస్క్ అని చెప్పి తీరాలి. ఈ క్రమంలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఓ మంచి స్థాయిలో నిలిచింది ఈ తెలుగు భామ.

  • Published Jun 12, 2024 | 3:43 PMUpdated Jun 12, 2024 | 3:43 PM
Chandini Chowdary : నేను చదివిన  కాలేజ్ లో దారుణమైన పరిస్థితులు చూశాను : చాందిని చౌదరి

మన ఇండస్ట్రీలో పక్క ఇండస్ట్రీ వాళ్లకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ తెలుగు వాళ్లకు దక్కదు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ విషయం గురించి ఇన్సైడ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఏవో ఒక కాంట్రవర్సిస్ జరుగుతూనే ఉంటాయి. ఇక ఇండస్ట్రీలో ఉన్న కాంపిటీషన్ ను నెగ్గుకుంటూ.. ఓ మంచి స్థాయిలో నిలబడాలి అంటే మాటలు కాదు. అందులో తెలుగు హీరోయిన్స్ కు ఇదొక పెద్ద టాస్క్ అని చెప్పి తీరాలి. ఇకరీసెంట్ గా ఓ తెలుగు హీరోయిన్.. తానూ తెలుగు అమ్మాయిగా కనిపించకుండా ఉండడానికి.. చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. ఎందుకు అలా.. అసలు ఆ అమ్మాయి ఎవరు.. ఏం జరిగి ఉంటుంది అనే విషయాలను చూసేద్దాం.

తెలుగు అమ్మాయిగా కనపడకూడదని ఆమె కష్టపడడానికి కారణం.. అదే ఫిగర్ తో పక్క రాష్ట్రం నుంచి వచ్చానంటే.. వెంటనే అవకాశం ఇస్తారు. అదే తెలుగు అమ్మాయి అని అంటే.. చూద్దాంలే.. చేద్దాంలే అని తిప్పించుకుంటారు. ఆ తర్వాత మెల్లగా సైడ్ చేసేస్తారు. ఇదంతా అందరికి తెలిసినా విషయమే. అయినా సరే.. ఈ పరిస్థితులను ఎదుర్కొని.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని.. నటిగా తనని తానూ నిరూపించుకుంటుంది.. తెలుగు నటి చాందిని చౌదరి. దాదాపు 15 ఏళ్లుగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ భామ యేవమ్ , మ్యూజిక్ షాప్ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ రెండు సినిమాలు జూన్ 14న థియేటర్స్ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. యేవమ్ సినిమాలో ఈ అమ్మడు.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను అలరించబోతుంది.

Chandini chowdary

ఈ క్రమంలో తాజాగా ఓ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తానూ చదువుకున్న ఓ  ఓ ప్రైవేట్ కాలేజ్  నుంచి పారిపోయిన వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంది. అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో చెప్పుకొచ్చింది. “నేను ఇంటర్.. విజయవాడలోని శ్రీచైతన్య కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. కానీ మూడే మూడునెలల్లో తిరిగి వచ్చేశాను. అక్కడ ఉదయం ఆరు గంటలకు క్లాస్‌లు స్టార్ట్ అయ్యేవి. అందరికీ కామన్ బాత్ రూంలు ఉండేవి. మనకి బాత్ రూం దొరకాలంటే గంటన్నర పాటు లైన్‌లో ఉండాల్సిన పరిస్థితి. బకెట్లు పట్టుకుని క్యూలోనే నిలబడాలి.ఆ తరువాత ఫుడ్ ఉండదు.. వెళ్లి క్లాస్‌లో కూర్చుని రెండు క్లాస్ అయిన తరువాత రావాలి. అప్పుడు స్నానం చేసి మళ్లీ పోవాలి. రోజులు నాలుగైదు గంటలు మాత్రమే నిద్ర ఉండేది.. అందుకే అక్కడ ఉండటం నా వల్లే కాలేదు. మూడు నెలలు కూడా ఉండలేకపోయాను. హాస్టల్ వదిలేసి వచ్చేశాను”. అంటూ చెప్పుకొచ్చింది చాందిని చౌదరి. ఇక గామీ, సమ్మతమే, కలర్ ఫొటో, మను, లై, కుందనపు బొమ్మ లాంటి ఎన్నో సినిమాలలో తనదైన మార్క్ ను కనబరిచింది ఈ అమ్మడు. మరి చాందిని చౌదరి పంచుకున్న ముచ్చట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి