iDreamPost

OTTలోకి కాంట్రవర్శియల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కొడుకు జునైద్ హీరోగా పరిచయం అయ్యాడు. కానీ సినిమా విడుదలకు ముందు కాంట్రవర్సీ చోటుచేసుకుంది. మనోభావాలు దెబ్బతింటున్నాయన్న కారణంతో పిటిషన్ దాఖలు కాగా... రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కొడుకు జునైద్ హీరోగా పరిచయం అయ్యాడు. కానీ సినిమా విడుదలకు ముందు కాంట్రవర్సీ చోటుచేసుకుంది. మనోభావాలు దెబ్బతింటున్నాయన్న కారణంతో పిటిషన్ దాఖలు కాగా... రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో

OTTలోకి కాంట్రవర్శియల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఎప్పటిలాగానే ఈ వారం కూడా ఓటీటీలో పలు సినిమాలు సందడి చేస్తున్నాయి. డిఫరెంట్ జోనర్ చిత్రాలు మూవీ లవర్స్‌ను ఆనందంలో ముంచి తేలేందుకు వచ్చేస్తున్నాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి మహారాజ్. అదేంటీ ఇది ఇటీవలే కదా థియేటర్లలోకి వచ్చేసింది అనుకుంటున్నారా.. అది విజయ్ సేతుపతి నటించిన తమిళ చిత్రం మహారాజ. ఇది ప్రముఖ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ నటించిన హిందీ మూవీ. రిలీజ్ కాకుండానే కాంట్రవర్సీగా మారింది . ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు ఈ స్టార్ కిడ్. తమ మనోభావాలు కించపరిచేలా ఉన్నాయంటూ.. ఈ సినిమా విడుదల చేయకుదంటూ ఓ హిందూ సంఘం కోర్టుకెక్కిన సంగతి గుర్తుంది కదా. ఆ సినిమానే ఇది. జూన్ 14న ఓటీటీలోకి రావాల్సింది..కానీ ఈ ఇష్యూ వల్ల ఆలస్యమైంది.

పిటిషన్‍లో పేర్కొన్నట్టు ఈ సినిమాలో ఓ మత మనోభావాలను కించపరిచేలా సన్నివేశాలు లేవని, సినిమా చూశామని గుజరాత్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయవచ్చని నెట్‍ఫ్లిక్స్, యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థలకు అనుమతి ఇచ్చింది. అంతకు ముందు జూన్ 13వ తేదీన విధించిన స్టేను ఎత్తివేసింది.  గుజరాత్ హైకోర్టు న్యాయ స్థానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓటీటీలోకి వచ్చేసింది. వారం రోజులు ఆలస్యంగా అంటే జూన్ 21 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. మహారాజ్ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫాంలోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా వీక్షించవచ్చు. ఇక ఈ సినిమా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే.. నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కించారు.

జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త కర్సన్ దాస్ ముల్జీ జీవితంపై ఈ మూవీ తెరకెక్కింది. 1860ల్లో ఓ బాబా అన్యాయాలను ముల్జీ బహిర్గతం చేయడం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. గుజరాతీ రచయిత సౌరభ్ షా రచించిన 1862 మహారాజ్ లిబెల్ కేస్ అనే పుస్తకం ఆధారంగా మహారాజ్ చిత్రాన్ని దర్శకుడు సిద్ధార్థ్ మల్హోత్రా తెరక్కించారు. మహారాజ్ చిత్రంలో జునైద్‍ ఖాన్‍తో పాటు జైదీప్ అహల్వాత్, అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే, శార్వరీ వాఘ్, జే ఉపాధ్యాయ్ కీలకపాత్రలు పోషించారు.  ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకం నిర్మించగా.. సోహైల్ సేన్ సంగీతం అందించారు. ఈ మూవీలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. జునైద్ ఖాన్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మూవీ వాచ్ చేసి .. ఎలా ఉందో కామెంట్లలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి