iDreamPost

NEET UG 2024: కూతురి కోసం తండ్రి చేసిన సాహసం….ఇది చరిత్రలో నిలిచిపోద్ది!

  • Published Jun 18, 2024 | 3:08 PMUpdated Jun 18, 2024 | 3:08 PM

ఏ తండ్రి అయినా తమ పిల్లలకు భరోసాని బాధ్యతని అందిస్తాడు. కానీ, తాజాగా ఓ తండ్రి మాత్రం తన కూతురికి తన చేతులతో మనో ధైర్యన్ని నింపడం కోసం.. ఏకంగా కూతురితో కలిసి ఎంతో కఠినమైన నీట్ పరీక్షను క్లియర్ చేసి సంచలనం సృష్టించారు. ఇక ఈ తండ్రి కూతుళ్ల సక్సెస్ ప్రతిఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకం. మరి వాళ్ల వారి విజయగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ తండ్రి అయినా తమ పిల్లలకు భరోసాని బాధ్యతని అందిస్తాడు. కానీ, తాజాగా ఓ తండ్రి మాత్రం తన కూతురికి తన చేతులతో మనో ధైర్యన్ని నింపడం కోసం.. ఏకంగా కూతురితో కలిసి ఎంతో కఠినమైన నీట్ పరీక్షను క్లియర్ చేసి సంచలనం సృష్టించారు. ఇక ఈ తండ్రి కూతుళ్ల సక్సెస్ ప్రతిఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకం. మరి వాళ్ల వారి విజయగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jun 18, 2024 | 3:08 PMUpdated Jun 18, 2024 | 3:08 PM
NEET UG 2024: కూతురి కోసం తండ్రి చేసిన సాహసం….ఇది చరిత్రలో నిలిచిపోద్ది!

ఇప్పటి వరకు తండ్రి అంటే ఒక రక్షుడు.. కష్టల్లో ఉంటే చేయి అందించే ఆప‌ద్భాందువుడు అని మాత్రం అనుకున్నాం. కానీ, తండ్రి అంటే.. కష్టల్లో ఉన్న పిల్లలను భుజం తట్టి ధైర్య చెప్పేవాడే కాదు.. తన చేతులతో మనలో మనోధైర్యన్ని నింపేవాడానేది అక్షర సత్యం. అంతేకాకుండా.. ప్రతి పిల్లలకు మొదటి గురువు తల్లే కాద.. తండ్రి కూడా అని చాలామందికి తెలియదు. ఎందుకంటే.. తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే బతుకు మార్గన్ని చూపే తండ్రికన్నా గొప్ప గురువు ఎవరు ఉండారు. ఒక రకంగా చెప్పాలంటే.. నిరంతరం తమ భవిష్యత్తు కోసం శ్రమించే నాన్న ప్రతిఒక్కరికి ఒక ఆదర్శం. అయితే ఇలా తమ పిల్లలే కాదు.. పదిమంది పిల్లల తండ్రులకు కూడా ఒక రోల్ మోడల్ గా నిలుస్తూ.. ఓ తండ్రి చేసిన గొప్ప పని ప్రస్తుతం సంచలనం సృష్టింస్తుంది. తను కూతురిలో ధైర్య నింపడానికి ఆ తండ్రి ఏకంగా ఎంతో కఠినమైన నీట్ పరీక్షను క్లియర్ చేశాడు. ఈ క్రమంలోనే.. తండ్రీకూతుళ్లు పోటాపోటిగా చదివి మొదటి ప్రయత్నంలోనే ర్యాంకులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారరు. ఇక ఈ తండ్రి కూతుళ్ల సక్సెస్ ప్రతిఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకం. మరి వాళ్ల వారి విజయగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దేశ రాజధాని ఢిల్లీలోని 50 ఏళ్ల వికాస్ మంగోత్రా ఓ కార్పొరేట్ ఉద్యోగి. కాగా, ఈయన కూమార్తె మీమాన్స (18) ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షకు సన్నద్ధమవుతుంది. కానీ,ఆ సమయంలో ఆమెకు ఓ డౌట వచ్చింది. వెంటనే ఆమె నానన్ దగ్గరికి వెళ్లి అడగ్గా.. ఆయన చాలా సింపుల్ గా తన డౌట్ ను చెప్పేశాడు. ఇక అంతా కఠినమైన కాన్సెప్ట్ లను చాలా ఈజీగా చెప్పేస్తున్న నాన్నను చూసి.. కూతురికి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ క్రమంలోనే.. నీట్ పరీక్షకు తన తండ్రినే టీచర్ గా సెలెక్ట్ చేసుకుంది. ఈ విషయం తన తండ్రి మంగోత్రాకు చెప్పడంతో.. ఆయన కూడా తన కుమార్తెకు మంచి ఉపాధ్యాయుడిగా గైడెన్స్ ఇవ్వాలనుకోవడమే కాకుండా.. తన కూతురిలో థైర్యన్ని నింపడం కోసం తాను కూడా పరీక్ష రాయలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే.. ఇద్దరూ కలిసి నీట్‌ యూజీ పరీక్షకు పోటాపోటిగా సిద్ధమయ్యారు. అనంతరం ఢిల్లీ NCRలో వేర్వేరు పరీక్ష కేంద్రాల్లో ఇద్దరూ పరీక్షలు రాశారు. తాజాగా వెలువడిన నీట్‌ యూజీ ఫలితాల్లో ఒకే ప్రయత్నంలో ఇద్దరూ క్వాలిఫై అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు.

కానీ, జమ్మూకి చెందిన మంగోత్రా 2022లో కూడా నీట్ లో అర్హాత సాధించారు. కాగా, ఆయన 90వ దశకం ప్రారంభంలో రాష్ట్ర PMTకి హాజరై డాక్టర్ కావాలనుకున్నారు. అందుకోసం మెడికల్ సీట సాధించడానికి మంచి మార్కులు ఉన్నప్పటికిీ, కొన్ని వ్యక్తిగత కారణాలతో ఆ ఏడాది ఇంజనీరింగ్‌ కోర్సులో జాయిన్‌ అయ్యారు.ఇకపోతే ఆయన నీట్ మాత్రేమే కాదు.. రెండు దశాబ్దాల క్రితం గేట్, JKCET, యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష వంటి పోటీ పరీక్షలకు కూడా హాజరయ్యారు.ఇక 2022లో మొదటిసారిగా నీట్‌ పరీక్షకు హాజరైనప్పుడు, అది తన స్వంత సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి, పరీక్ష స్వభావాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడినట్లు ఆయన తెలిపారు. 2024లో రెండవసారి తన కుమార్తెను మోటివేట్ చేయడంతో పాటు తన బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడానికి నీట్‌ పరీక్ష రాసినట్లు చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా మంగోత్రా తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ..మొదట నేను నీట్ పరీక్ష రాసినప్పుడు నా వయసు గురించి నేను ఆలోచించాను. కానీ, అప్పటికే 2021లో ఒడిషాలో 60 ఏళ్ల వ్యక్తి కూడా నీట్‌లో అర్హత సాధించాడనే విషయం తెలుసుకున్నాను. దీంతో నా కుమార్తెతోపాటు పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యాను. ఇక నాకు బోదించడం అంటే చాలా ఆసక్తి. నేను నా పాఠశాల రోజుల నుంచే టీచింగ్ పట్ల ఆసక్తి పెరిగింది.ఇకనా తొలి ప్రయత్నం 2022లో పరీక్ష రాసినప్పుడు నాలుగు నెలలు మాత్రమే చదువుకున్నానని, అయితే రోజుకు 15 నుంచి 16 గంటలు చదువుకోవడానికి కేటాయించానని, అందుకు తాను చేస్తున్న ఉద్యోగానికి సెలవులు పెట్టి మరీ ప్రిపేర్‌ అయ్యనని ఆయన తెలిపారు. అంతేకాకుండా తన కుమార్తెకు బోధించేటప్పుడు పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లను గుర్తించానని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రిపరేషన్‌లో సహకరిస్తే వారు సులువుగా గట్టెక్కుతారని ఆయన చెప్పుకొచ్చారు. మరి ప్రస్తుతం మంగోత్రా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, ఈ ఏడాది మే 5న దేశ వ్యాప్తంగా 571 నగరాల్లో జరిగిన నీట్‌ యూజీ 2024 పరీక్షకు దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారయిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి