iDreamPost

అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి కడితే చాలు.. ప్రతి నెల చేతికి 20,500

మీరు ప్రతి నెల కొంత ఆదాయన్ని కోరుకుంటున్నారా? అయితే అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే చాలు ప్రతి నెల 20500 అందుకోవచ్చు.

మీరు ప్రతి నెల కొంత ఆదాయన్ని కోరుకుంటున్నారా? అయితే అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే చాలు ప్రతి నెల 20500 అందుకోవచ్చు.

అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి కడితే చాలు.. ప్రతి నెల చేతికి 20,500

ప్రస్తుత కాలంలో డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది. ప్రతి పని డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు తమ ఆదాయాలను పెంచుకునేందుకు ఉన్న ఆదాయాన్ని రెట్టింపు చేసుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను వెతుకుతున్నారు. చేతిలో ఉన్న డబ్బును మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేసి లాభాలను అందుకోవాలని భావిస్తున్నారు. పొదుపు అనేది జీవితంలో చాలా అవసరం. ఆపద సమయంలో మీరు నేడు పొదుపు చేసుకునన్న సొమ్ము కాపాడుతుంది. మరి మీరు కూడా మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ప్రతి నెల కొంత ఆదాయం కావాలని కోరకుంటున్నారా? అయితే మీకోసం సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఆ పథకం మరేదో కాదు పోస్టాఫీస్ అందించే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్.

సాధారణంగా ఉద్యోగం చేసే సమయంలో ప్రతి నెల శాలరీ వస్తుంది కాబట్టి అన్ని అవసరాలను తీర్చుకునేందుకు వీలుంటుంది. కానీ రిటైర్ మెంట్ అనంతరం పెన్షన్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కూడా ప్రతి నెల కొంత ఆదాయం ఉండాలంటే పోస్టాఫీస్ అందించే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో పెట్టుబడి పెడితే చాలు. ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే నెల నెలా రూ. 20,500 ఆదాయం పొందొచ్చు. ఐదు సంవత్సరాలపాటు అందుకోవచ్చు. 60 సంవత్సరాల వయసున్న వారు ఈ పథకంలో చేరొచ్చు. ఈ పథకంపై ప్రభుత్వం ప్రస్తుతం 8.2 శాతం వడ్డీని అందిస్తున్నది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో కనీసం రూ. 1000 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు ఒకసారి రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే, ప్రస్తుతమున్న వడ్డీ రేటు ప్రకారం వారు ప్రతి మూడు నెలలకు రూ.10,250 అందుకుంటారు. 5 సంవత్సరాలలో మీరు వడ్డీ నుంచి రూ. 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. మీరు గరిష్టంగా రూ. 30 లక్షలు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో పెట్టుబడి పెడితే, మీకు ప్రతి సంవత్సరం రూ. 2,46,000 వడ్డీ లభిస్తుంది. అంటే, మీరు నెలవారీ ప్రాతిపదికన రూ. 20,500 అందుకుంటారు. అంటే ఈ స్కీమ్ లో మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బుపై ఆధారపడి మీ ఆదాయం ఉంటుందన్నమాట. ప్రభుత్వ పథకం కాబట్టి సురక్షితమైన రాబడులను అందుకోవచ్చు. ఈ స్కీంలో పెట్టుబడులతో ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి