iDreamPost

ఈ స్కీమ్‌తో లాభాలే లాభాలు.. రోజుకు 266 పెట్టుబడితో.. చేతికి 25 లక్షలు..

మీరు పెట్టే పెట్డుబడిపై అధిక లాభాలు అందుకోవాలని భావిస్తున్నారా? అయితే ప్రభుత్వ రంగానికి చెందిన ఈ పథకంలో పెట్టుబడి పెడితే ఏకంగా చేతికి 25 లక్షలు అందుకోవచ్చు.

మీరు పెట్టే పెట్డుబడిపై అధిక లాభాలు అందుకోవాలని భావిస్తున్నారా? అయితే ప్రభుత్వ రంగానికి చెందిన ఈ పథకంలో పెట్టుబడి పెడితే ఏకంగా చేతికి 25 లక్షలు అందుకోవచ్చు.

ఈ స్కీమ్‌తో లాభాలే లాభాలు.. రోజుకు 266 పెట్టుబడితో.. చేతికి 25 లక్షలు..

సంపాదించిన సొమ్ములో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. చాలా మంది పెట్టుబడి పెట్టేందుకు అందుబాటులో ఉన్న మార్గాలేంటని ఆలోచిస్తున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తే.. లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ రిస్క్ తో కూడిన వ్యవహారం. అదే ప్రభుత్వ రంగాలకు చెందిన స్కీముల్లో పెట్టుబడిపెడితే సురక్షితమైన రిటర్న్స్ అందుకోవచ్చు. మరి మీరు డబ్బు సంపాదించాలి.. దాన్ని రెట్టింపు చేయాలని భావిస్తున్నారా? మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఎస్బీఐ అందించే పీపీఎఫ్ పథకంలో రోజుకు 266 ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా చేతికి 25 లక్షలు అందుకోవచ్చు.

ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ (పీపీఎఫ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే అధిక రాబడిని అందుకోవచ్చు. పెట్టుబడిపై 7.1 శాతం వడ్డీని అందుకోవచ్చు. ఈ పథకంలో 15సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా 5 సంవత్సరాల చొప్పున పెంచుకుంటూ పోవొచ్చు. ఎవరైనా వ్యక్తి గానీ.. మైనర్ పేరిట గానీ ఖాతాను ఓపెన్ చేయొచ్చు. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో ఏటా కనీసం రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. బ్యాంకుతో పాటు, మీరు పోస్టాఫీసులో కూడా పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించొచ్చు.

ఈ పథకంలో మీరు ప్రతి నెలా రూ. 8000 పెట్టుబడి పెడితే మీరు కళ్లు చెదిరే లాభాలను అందుకోవచ్చు. మీరు రోజుకు 266 పొదుపు చేస్తే చాలు.. ఏకంగా మెచ్యూరిటీ సమయానికి 25 లక్షలు అందుకొచ్చు. ఒక వ్యక్తి నెలకు రూ. 8000 డిపాజిట్ చేశాడనుకుంటే, ఒక సంవత్సరంలో రూ. 96,000 జమ అవుతుంది. 15 సంవత్సరాలలో మొత్తం డిపాజిట్ సొమ్ము మొత్తం రూ.14,40,000 అవుతుంది. డిపాజిట్ చేసిన ఈ మొత్తానికి 7.1 శాతం వడ్డీ వస్తుంది. మీకు రూ. 10,84,544 వడ్డీ లభిస్తుంది. మోచ్యూరిటీ కాలానికి పెట్టుబడి సొమ్ము, దానిపై వచ్చే వడ్డీ కలుపుకుని రూ.25,24,544 చేతికి అందుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి