iDreamPost

జీవితాంతం ఆదాయం కావాలా? ఒకసారి కడితే చాలు.. నెలకు 12 వేల పెన్షన్

మీరు లైఫ్ లాంగ్ ఆదాయం కావాలని కోరకుంటున్నారా? అయితే అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు నెలకు 12 వేల పెన్షన్ పొందొచ్చు.

మీరు లైఫ్ లాంగ్ ఆదాయం కావాలని కోరకుంటున్నారా? అయితే అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు నెలకు 12 వేల పెన్షన్ పొందొచ్చు.

జీవితాంతం ఆదాయం కావాలా? ఒకసారి కడితే చాలు.. నెలకు 12 వేల పెన్షన్

డబ్బు అనేది జీవితంలో ప్రతి దశలో అవసరమే. చేతిలో డబ్బు లేకుండా లైఫ్ ని ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అందుకే దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నట్టు.. అవకాశం ఉన్నప్పుడే సంపాదించుకుని భవిష్యత్ అవసరాలకు కొంత పొదుపు చేసుకుంటే బెటర్. ఇవ్వాళ దాచుకున్న సొమ్ము ఆపద కాలంలో ఆదుకుంటుంది. అయితే మరి ఇన్వెస్ట్ చేయాలంటే ఏయే పథకాలు అందుబాటులో ఉన్నాయి. సురక్షితమైన రాబడిని అందుకోవాలంటే ఏ స్కీముల్లో పెట్టుబడిపెడితే మంచిది? అని ఆలోచిస్తున్నట్లైతే.. మీకోసం అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోనేషన్ ఆఫ్ ఇండియా పెన్షన్ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఇందులో ఒకసారి పెట్టుబడి పెడితే చాలు జీవితాంతం నెలకు రూ. 12 వేల పెన్షన్ వస్తుంది. నలబై ఏళ్ల వయసు నుంచే ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు.

దిగ్గజ బీమా సంస్థ ఎల్ఐసీ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ ను ప్రవేశపెడుతూ ఉంటుంది. ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థ కాబట్టి మీ పెట్టుబడికి భద్రత ఉంటుంది. ఎలాంటి రిస్క్ లేకుండా లాభాలు అందుకోవచ్చు. ఎల్ఐసీ ప్రవేశపెట్టిన సరళ్ పెన్షన్ యోజన పథకంలో ఒకసారి కడితే జీవితాంతం నెలక 12 వేల పెన్షన్ పొందొచ్చు. ఇందులో చేరితే 40 ఏళ్ల నుంచే పెన్షన్ పొందొచ్చు. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. ఈ పాలసీలో చేరాలనుకునే వారు 40 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు వారు అర్హులు. అయితే మీరు పొందాలనుకునే పెన్షన్ మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది.

నెలకు రూ. 12 వేల పెన్షన్:

ఎల్ఐసీ సరళ్ పెన్షన్ యెజనలో రూ. 10 లక్షలు సింగిల్ ప్రీమియంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు మీరు ప్రతి సంవత్సరం రూ.50,250 పొందుతారు. అంటే మీరు ప్రతి నెలా రూ.4,187 పెన్షన్ అందుకుంటారు. 42 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి రూ.30 లక్షల పెట్టి ఈ సరళ్ పెన్షన్ యోజన పాలసీలో చేరితే, ఆ వ్యక్తికి జీవితాంతం నెలకు రూ.12,388 వరకు పెన్షన్ వస్తుంది. సరళ్ పెన్షన్ యెజనలో చేరాలనుకునే వారు ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో చేరొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి