iDreamPost

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. నెలకు 7 వేలు పెట్టుబడి పెడితే చాలు చేతికి 12 లక్షలు

మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. మీరు నెలకు 7 వేలు పెట్టుబడి పెడితే చాలు ఏకంగా 12 లక్షలు అందుకోవచ్చు.

మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. మీరు నెలకు 7 వేలు పెట్టుబడి పెడితే చాలు ఏకంగా 12 లక్షలు అందుకోవచ్చు.

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. నెలకు 7 వేలు పెట్టుబడి పెడితే చాలు చేతికి 12 లక్షలు

దేశ ప్రజల కోసం ప్రభుత్వాలు వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఆర్థిక భరోసా కల్పించేందుకు మంచి రాబడినిచ్చే పథకాలను తీసుకొస్తున్నాయి. అయితే ఇలాంటి పథకాలపై చాలా మందికి అవగాహన లేక వాటి ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. ఈ రోజుల్లో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత మరేదేనికి లేదు. అందుకే ప్రతిఒక్కరు డబ్బు వెనకాల పరుగెడుతున్నారు. సంపాదించిన డబ్బును డబుల్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను వెతుకుతున్నారు. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే ఈ పథకంలో పెట్టుబడి పెడితే లక్షల రూపాయలను అందుకోవచ్చు. నెలకు 7 వేలు ఇన్వెస్ట్ చేస్తే చేతికి 12 లక్షలు వస్తాయి. ఆ పథకమే రికరింగ్ డిపాజిట్.

పోస్టాఫీస్ అందించే పథకాల్లో రికరింగ్ డిపాజిట్ ఒకటి. ప్రభుత్వ పథకం కాబట్టి ఎటువంటి రిస్క్ లేకుండా అధిక రాబడిని పొందొచ్చు. ఈ పథకంలో ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రికరింగ్ డిపాజిట్ పై 6.7 శాతం వడ్డీ లభిస్తున్నది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు మాత్రమే. మెచ్యూరిటీ తర్వాత కావాలనుకుంటే ఈ పథకాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఇందుకోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టే వీలుంది.

Post office scheme

రికరింగ్ డిపాజిట్ పథకంలో ప్రతి నెలా రూ. 7000 పెట్టుబడి పెడితే మీరు 5 సంవత్సరాలలో మొత్తం రూ. 4,20,000 అవుతుంది. ప్రస్తుతమున్న వడ్డీ రేటు ప్రకారం ఐదు సంవత్సరాలలో రూ. 79,564 వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ సమయానికి పెట్టుబడి, దానిపై వచ్చే వడ్డీ కలుపుకుని మొత్తం రూ. 4,99,564 అవుతుంది. అయితే మీరు 12 లక్షలు పొందాలనుకుంటే ఈ పథకాన్ని మరో 5 ఏళ్లు పొడిగించాలి. అప్పుడు 10 సంవత్సరాల పాటు నిరంతరంగా ఇన్వెస్ట్ చేస్తే మీ మొత్తం పెట్టుబడి రూ. 8,40,000 అవుతుంది. దీనిపై, మీరు 6.7 శాతం వడ్డీతో రూ. 3,55,982 అందుకుంటారు. మెచ్యూరిటి కాలానికి మీరు రూ. 11,95,982 అంటే దాదాపు 12 లక్షల రూపాయలు చేతికి వస్తాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి