iDreamPost

Parle G: పార్లేజీ బిస్కెట్‌ ప్యాకెట్‌ మీద ఉండే పాప ఎవరో తెలిసిపోయింది.. ఇంతకీ ఎవరంటే

  • Published Jun 21, 2024 | 12:55 PMUpdated Jun 21, 2024 | 12:55 PM

పార్లేజీ బిస్కట్‌ ప్యాకెట్‌ మీద ఉండే పాప గురించి ఇప్పటికే మీడియాలో బోలేడు వార్తలు వచ్చాయి. మరి ఇంతకు ఆ పాప ఎవరంటే..

పార్లేజీ బిస్కట్‌ ప్యాకెట్‌ మీద ఉండే పాప గురించి ఇప్పటికే మీడియాలో బోలేడు వార్తలు వచ్చాయి. మరి ఇంతకు ఆ పాప ఎవరంటే..

  • Published Jun 21, 2024 | 12:55 PMUpdated Jun 21, 2024 | 12:55 PM
Parle G: పార్లేజీ బిస్కెట్‌ ప్యాకెట్‌ మీద ఉండే పాప ఎవరో తెలిసిపోయింది.. ఇంతకీ ఎవరంటే

పార్లేజీ బిస్కెట్‌తో భారతీయులకు అవినాభావ సంబంధం ఉంది. ఇప్పటికి మార్కెట్‌లోకి ఎన్ని రకాల బ్రాండ్స్‌ బిస్కెట్‌లు వచ్చినా.. వీటికి ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఇక కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పార్లే జీ బిస్కెట్‌లు రికార్డ్‌ స్థాయిలో అమ్ముడుపోయి చరిత్ర సృష్టించాయి. ఎన్నో ఏళ్లుగా ఈ బిస్కెట్‌లు మార్కెట్‌లో ఉన్నాయి. దీని మీద ఉండే జీ అనే అక్షరానికి అనేక అర్థాలు వాడుకలో ఉన్నాయి. కొందరు దాన్ని గౌరవ సూచకంగా భావిస్తే.. చాలా మంది జీ అంటే జీనియస్‌ అనుకుంటారు. కానీ అతి తక్కువ మందికి మాత్రమే.. బిస్కెట్‌ ప్యాకెట్‌ మీద ఉండే జీ అంటే.. గ్లూకోజ్‌ అని తెలుసు.

ఏళ్లుగా మార్కెట్‌లో పార్లేజీ తన ప్రస్థానం కొనసాగిస్తోంది. ఇక ఈ బిస్కెట్‌ ప్యాకెట్‌ మీద ఉండే పాపపై కూడా బోలేడు వార్తలు వచ్చాయి. ఆ పాప మరి ఎవరో కాదు.. ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి భార్య సుధామూర్తి అని కొందరంటే.. కాదు తనొక మోడల్‌ అని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ ఇన్నాళ్లుకు ఆ పాప ఎవరో తెలిసిపోయింది. ఆ వివరాలు..

పార్లేజీ బిస్కట్‌ ప్యాకెట్‌ మీద ఉండే పాప ఎవరో తెలిసిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీ మార్కెటింగ్‌ హెడ్‌ కృష్ణారావు బుద్ధ వెల్లడించారు. సాధారణంగా చాలా మంది పార్లే జీ బి‍స్కెట్‌ ప్యాకెట్‌ మీద ఉన్న పాపను.. ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి అని భావించేవారు. కానీ ఆ పాప ఆవిడ కాదంట. మరి ఇంతకు ఆ చిన్నారి ఎవరు.. ఎక్కడ ఉంటుంది అనే ప్రశ్నలకు బదులిస్తూ.. కృష్ణారావు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. వాస్తవంగా చెప్పాలంటే.. పార్లే జీ బిస్కెట్‌ ప్యాకెట్‌ మీద ఉన్న పాప రియల్‌ కాదు. అంటే వాస్తవంగా అలాంటి పాప ఎక్కడా లేదు. అది తమ ఏజెన్సీ ఊహాల నుంచి పుట్టిన చిత్రం అని తెలిపారు. దాంతో ఇన్నాళ్లు.. పార్లేజీ బిస్కట్‌ ప్యాకెట్‌ మీద ఉన్న పాపకు సంబంధించిన మిస్టరీ వీడింది.

ఓ యూట్యూబ్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణారావు బుద్ధా.. పార్లేజీ కంపెనీ ప్రస్థానం, ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకెళ్లడం కోసం వారు చేసే ప్రయత్నాలు, మోనాకో బిస్కట్‌ ప్యాకెట్‌ పేరు ఉన్న కథ, మార్కెటింగ్‌లోకి రావాలనుకునే వారు తెలుసుకోవాల్సిన అంశాలు, బ్రాండ్‌ను బిల్డ్‌ చేయాలంటే ఏం చేయాలి వంటి అనేక అంశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Raw Talks With VK – Reacts (@podcastsreacts)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి