iDreamPost

ప్రభుత్వ స్కూలులో టీచర్​గా బిగ్​బాస్ వితికా.. ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజన్స్!

  • Author singhj Published - 03:55 PM, Wed - 12 July 23
  • Author singhj Published - 03:55 PM, Wed - 12 July 23
ప్రభుత్వ స్కూలులో టీచర్​గా బిగ్​బాస్ వితికా.. ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజన్స్!

మన దేశంలో ఒకప్పుడు చదువు అంటే అందరికీ సర్కారు బడులు, ప్రభుత్వ కళాశాలలే గుర్తుకొచ్చేవి. నాణ్యమైన విద్యను బోధించే ఎంతోమంది అనుభవజ్ఞులు, విజ్ఞానవంతులైన టీచర్లు, ప్రొఫెసర్లు ఉండేవారు. అందుకే అందరూ గవర్నమెంట్ విద్యా సంస్థల్లో చదువుకునేందుకు ఆసక్తి, ఉత్సాహం చూపించేవారు. అయితే ఆ తర్వాత పరిస్థితుల్లో బాగా మార్పు వచ్చింది. ప్రైవేటు స్కూళ్ల ఎంట్రీతో పరిస్థితులు మారిపోయాయి. అందరూ అక్కడికే తమ పిల్లల్ని చదువుకోవడానికి పంపడం మొదలుపెట్టారు. దీంతో విద్యార్థులు లేక ప్రభుత్వ విద్యా సంస్థలు వెలవెలబోయాయి. కానీ ఈ పరిస్థితుల్లో క్రమంగా మార్పు వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో సర్కారీ బడుల్లో చదువుకునేవారి సంఖ్య పెరుగుతోంది.

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన సౌకర్యాలు, టెక్నాలజీ వినియోగం లాంటి మార్పులు చేయడంతో అక్కడ చేరే పిల్లల సంఖ్య ఏటికేడు పెరుగుతూ పోతోంది. గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లల చేరికల శాతాన్ని పెంచేందుకు.. అక్కడ మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ముందుకు వస్తున్నారు. ఆయా స్కూళ్లకు, పిల్లలకు తమవంతు తోడ్పాటు, సాయాన్ని అందిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్, బిగ్​బాస్ కంటెస్టెంట్ వితికా శేరు కూడా ఇలాంటి ఒక మంచి పని చేశారు. ఆమె తాజాగా టీచర్ అవతారం ఎత్తారు. సర్కారు బడిలో పాఠాలు చెప్పి ఆకట్టుకున్నారు. జీవితంలో ఎలా ఉండాలనేది పిల్లలకు నేర్పించారు.

‘పొద్దున లేవగానే చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయ్.. నేను బెస్ట్, నేను చాలా స్ట్రాంగ్, నేను ఏదైనా చేయగలను, నేను సాధించలేనిది ఏదీ లేదని అనుకోవాలి. నన్ను చూసి నేను గర్వపడుతున్నా, నా లైఫ్​కు నేనే మహారాణి అని భావించాలి. అలాగే అందర్నీ గౌరవిస్తా, అదే టైమ్​లో నన్ను నేను గౌరవించుకుంటా, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే ఎక్కువ కష్టపడి జీవితంలో ఏదైనా సాధించగలరు. ఇలా చేస్తానని నాకు మాట ఇవ్వండి’ అని విద్యార్థులను కోరారు వితికా షేరు. హైదరాబాద్, మణికొండలోని ప్రభుత్వ స్కూలుకు తాను వచ్చానని.. తనలాగే ఎవరైనా తమకు ఇష్టమైన సబ్జెక్ట్ గురించి పిల్లలకు పాఠాలు చెప్పొచ్చన్నారు వితికా. విద్యార్థులకు జీవిత పాఠాలు బోధించిన వితికాను సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఆమె నిజంగా గ్రేట్ అని, వితికా చేసిన పనికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vithika Sheru (@vithikasheru)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి