iDreamPost

ప్రమాదంలో జనసేన.. గ్లాస్ గుర్తు గోవిందా?

ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ఎన్నిక సంఘం పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాలు వివిధ అంశాలపై ఫిర్యాదులు చేశాయి. ఈ నేపథ్యంలో వీరి ఫిర్యాదులే జనసేనను ప్రమాదంలో పడేశాయనే వార్తలు వినిపిస్తోన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ఎన్నిక సంఘం పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాలు వివిధ అంశాలపై ఫిర్యాదులు చేశాయి. ఈ నేపథ్యంలో వీరి ఫిర్యాదులే జనసేనను ప్రమాదంలో పడేశాయనే వార్తలు వినిపిస్తోన్నాయి.

ప్రమాదంలో జనసేన.. గ్లాస్ గుర్తు గోవిందా?

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ 175 గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అలానే ప్రతిపక్ష టీడీపీ, జనసేనాలు కూడా వైసీపీ విజయాన్ని అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తోన్నాయి. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓట్ల విషయంలో కూడా ఇరు పక్షలా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పరస్పరం ఫిర్యాదులు చేశాయి. ఈ నేపథ్యంలో జనసేన ప్రమాదంలో పడిపోయింది. ఈ ఫిర్యాదులు పర్వంలో జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు పోయేలా ఉంది. అందుకు బలమైన కారణం కూడా ఉంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కేంద్రఎన్నికల సంఘం పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు అధికారులు ఏపీకి వచ్చారు. ఏపీలో పర్యటిస్తున్న ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ బృందం కలిసింది. ఈ సందర్భంగా జనసేనతో పాటు మరో ఐదు అంశాలపై  వైసీపీ ఫిర్యాదు  చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  అసలు గుర్తింపు లేని జనసేన పార్టీకీ కామన్ సింబల్ ఎలా అనుమతించారని ఎలక్షన్ కమిషన్ కి వైసీపీ ఫిర్యాదు చేసింది. గుర్తింపు లేని జనసేన పార్టీకి కామన్ సింబల్ ఇవ్వొద్దని సీఈసీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడం చర్చనీయాశంమైంది. నిబంధనల ప్రకారం గుర్తింపులేని పార్టీకి రెండు వరుస ఎన్నికల్లో ఒకే సింబల్ ఇవ్వకూడదని వైసీపీ ఫిర్యాదు చేసినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు.

ఇదే సమయంలో కోనేరు సురేష్ అనే వ్యక్తి  పది లక్షల పైచిలుకు ఓట్లు బోగస్ అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేశారు. దానిపై కూడా వైసీపీ అభ్యతరం తెలిపింది. బోగస్ ఓట్లు తేల్చాల్సింది ఎన్నికల అధికారులని, ఒక వ్యక్తి ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. అసలు బోగస్ ఓట్లపై ఫిర్యాదు చేయడమే ఓ బోగస్ అని సాయిరెడ్డి అన్నారు. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కామన్ గా ఉన్న ఓట్ల గురించి ప్రస్తావించారు. తెలంగాణలో ఓట్లను తొలగించిన తరువాతే, ఏపీలో చేర్చాలని విన్నవించారు.

ఇలా జనసేనపై వైసీపీ ఫిర్యాదు చేయడం అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ కనీసం గాజు గ్లాసు గుర్తును స్థిరంగా నిలబెట్టుకోలేని దుస్థితిలో ఉన్నారనే మాటలు వినిపిస్తోన్నాయి.  ఇటీవల తెలంగాణలో కూడా గ్లాస్ గుర్తును కామన్ సింబల్ నుంచి తొలగించి.. స్వతంత్రులకు  కూడా కేటాయిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇలా జనసేన సేన నుంచి నేతలు బయటక వెళ్లడంతో పాటు, పార్టీ గుర్తుకు వెళ్లిపోయే ప్రమాద ఏర్పడిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

ఒక వేళ నిజంగా అదే జరిగి.. గ్లాస్ సింబల్ పోతే.. జనసేన అభ్యర్థులు కూడా టీడీపీ గుర్తుపై పోటీ చేయాల్సి వస్తుందేమో అనే అనుమానుల వ్యక్తమవుతున్నాయి. అలానే వైసీపీ తమ పలుకుబడితో గుర్తు లేకుండా చేస్తారమే అని జనసేన నేతలు కూడా భయపడుతున్నారని టాక్.  వైసీపీ ఫిర్యాదుతో కేంద్ర ఎన్నికల సంఘం కఠిన నిర్ణయంతీసుకుంటే తమ గతి ఏంటనే ప్రశ్న కూడా జనసేన నేతలు ఉత్పన్నమైందనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా పరస్పర ఫిర్యాదులు జనసేన గుర్తుకే ఎసరు తెచ్చాయి. మరి.. ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి