iDreamPost

సత్ఫాలితాల రివర్స్ టెండర్స్

సత్ఫాలితాల రివర్స్ టెండర్స్

వైఎస్ జగన్ సర్కార్ అవలంభిస్తున్న రివర్స్ టెండర్ విధానం సత్ఫాలితాలను ఇస్తోంది. తాజాగా పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టులలో 12వ విడత రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియలో ఏపీ టిడ్కో రూ.30.91కోట్లు ఆదా చేసింది. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో 5,088 హౌసింగ్‌ యూనిట్ల (ఇళ్ల) నిర్మాణానికి టిడ్కో బుధవారం రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తం రూ.306.61 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా, డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ రూ.275.70 కోట్లతో బిడ్‌ దాఖలు చేసి ఎల్‌–1గా నిలిచింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై రూ.30.91 కోట్లు భారం తగ్గింది.

ఏపీ టిడ్కో ఇంత వరకు మొత్తం 12 విడతల్లో 63,744 ఇళ్ల నిర్మాణానికి రూ.3,239.39 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ నిర్వహించగా, రూ.2,847.16 కోట్లతో పనులను ఖరారు చేశారు. రూ.392.23 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. వివిధ ప్యాకేజిల్లో చదరపు అడుగు నిర్మాణానికి రూ.156 నుంచి రూ.316 వరకు వ్యయం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన వివిధ పనుల్లో రివర్స్ టెండర్ల వల్ల మొత్తంగా రూ.1,869.51 కోట్లు ఆదా అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి