iDreamPost

కేసీఆర్ కీలక హామీ.. BRS గెలిస్తే ఆ ఫైలుపైనే తొలి సంతకం

  • Published Nov 28, 2023 | 1:05 PMUpdated Nov 28, 2023 | 1:05 PM

తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరకున్న సమయంలో గులాబీ పార్టీ అధ్యకుడు కేసీఆర్ కీలక హామీ ఇచ్చారు. మరోసారి అవకాశమిస్తే అధికారంలోకి రాగానే ఆ ఫైల్ మీదనే తొలి సంతకం పెడతాను అన్నారు. ఆ వివరాలు..

తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరకున్న సమయంలో గులాబీ పార్టీ అధ్యకుడు కేసీఆర్ కీలక హామీ ఇచ్చారు. మరోసారి అవకాశమిస్తే అధికారంలోకి రాగానే ఆ ఫైల్ మీదనే తొలి సంతకం పెడతాను అన్నారు. ఆ వివరాలు..

  • Published Nov 28, 2023 | 1:05 PMUpdated Nov 28, 2023 | 1:05 PM
కేసీఆర్ కీలక హామీ.. BRS గెలిస్తే ఆ ఫైలుపైనే తొలి సంతకం

మరి కొన్ని గంటల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. మరి కొన్ని గంటల్లో ప్రచారం ఆగిపోనుంది. మరో 48 గంటల్లో తెలంగాణలో పోలింగ్ జరనగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడిస్తారు. ఇక ప్రచారానికి నేడు ఆఖరి రోజు కావడం.. అందునా సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే సమయం ఉండటంతో.. అగ్ర నేతలందరూ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించడం కోసం అన్ని పార్టీలు ప్రజాకర్షక హామీలతో మేనిఫెస్టోలు తయారు చేశాయి. బీఆర్ఎస్ ద్వారానే సంక్షేమ పాలన సాధ్యమని మరోసారి పట్టం కట్టాలని ఆ పార్టీ నేతలు కోరుతుండగా.. అవినీతి పాలనను అంతమెుందించి తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను కోరుతున్నాయి.

ఈ ఎన్నికల్లో గెలవడం కోసం.. కాంగ్రెస్ ప్రధానంగా ఆరు గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్తుండగా.. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి కార్డుతో ఎన్నికల పర్వంలో దూసుకుపోతుంది. ఇక కాంగ్రెస్ నేతలైతే.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్లు కూడా రాసిస్తున్నారు. గెలిపిస్తే అధికారంలోకి రాగానే ముందుగా ఫలనా పని చేస్తామంటూ చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ కూడా కీలక హామీ ఇచ్చారు. హ్యాట్రిక్ సాధించి మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తాను సంతకం పెట్టే తొలి ఫైల్ ఏంటో చెప్పుకొచ్చారు. ఆ వివరాలు..

ఆఫైల్ మీదే తొలి సంతంక…

ప్రజలు తమను మరోసారి గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే అసైన్డ్‌ భూములకు పట్టాలిచ్చే ఫైలుపై తొలి సంతకం చేస్తానని తెలిపారు కేసీఆర్. ఫస్ట్ కేబినెట్ భేటీలోనే ఆ ఫైలుకు ఆమోద ముద్ర వేస్తానని వెల్లడించారు. సోమవారం షాద్‌నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాశీర్వద బహిరంగ సభలో మాట్లాడుతూ.. కేసీఆర్ ఈ హామీ ఇచ్చారు. అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని తాము చెబుతుంటే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే.. అసైన్డ్‌ భూములను గుంజుకుంటారంటూ కాంగ్రెస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని.. తాము అలా ఎందుకు చేస్తామని ప్రశ్నించారు కేసీఆర్. గత పదేళ్లలో అసైన్డ్ భూములు ఎక్కడైనా లాక్కున్నామా అని ప్రశ్నించారు. అసైన్డ్‌ భూములను గుంజుకోవడం కాదు.. ఎన్నికలు అయిపోగానే తొలి క్యాబినెట్‌ భేటీలోనే అసైన్డ్‌ భూములకు పట్టాలిచ్చే ఫైలుపై సంతకం పెడతానని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. రైతుకు పెట్టుబడి సాయంగా రైతుబంధు ఇస్తున్నామని.. దురదృష్టం కొద్ది రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల రైతు బీమా ప‌రిహారం కూడా అందిస్తున్నామని చెప్పుకొచ్చారు కేసీఆర్. రైతులు పండించిన పంటను 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేస్తున్నామన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ కావాలన్నా.. కొర్రీలు పెట్టుకుండా రైతుబంధు వేయాలన్నా మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలన్నారు కేసీఆర్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి