iDreamPost

Video: మెడికల్ షాప్ లో బిల్లింగ్ చేస్తూ..గుండెపోటుతో వ్యక్తి మృతి!

ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారు ఆకస్మాత్తుగా హార్ట్ ఎటాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతురున్నారు. తాజాగా ఓ వ్యక్తి మెడికల్ షాప్ లో కుప్పకూలిపోయాడు.

ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారు ఆకస్మాత్తుగా హార్ట్ ఎటాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతురున్నారు. తాజాగా ఓ వ్యక్తి మెడికల్ షాప్ లో కుప్పకూలిపోయాడు.

Video: మెడికల్ షాప్ లో బిల్లింగ్ చేస్తూ..గుండెపోటుతో వ్యక్తి మృతి!

మరణం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరం ఊహించలేము. రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తలు, ఇతర ఘటనలతో మృత్యువు కొందరిని పలకరిస్తుంది. ఇది ఇలా ఉంటే.. గుండెపోటుతో కారణం సంభంవించే మరణాల సంఖ్య ఎక్కువైంది. అప్పటి వరకు ఎంతో హుషారుగా కనిపించే వారు…మరుక్షణమే హార్ట్ ఎటాక్ తో మృత్యువు ఒడిలోకి చేరుతున్నాడు. ఇప్పటికే ఇలా గుండెపోటు కారణంగా కుప్పకూలిపోయి మరణించిన వారిని చాలా మందినే చూశాము. అలానే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి మెడికల్ షాపులో బిల్లింగ్ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ శివారు ప్రాంతమైన మేడ్చల్ మల్కాజ్ గిరి ప్రాంతంలోని కీసర గ్రామంలో ఈ ఘోరం జరిగింది. కీసరలోని మెడ్స్ అనే మెడికల్ షాపులో మురళీ అనే వ్యక్తి ఫార్మాసిస్టుగా పని చేస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటూ… అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. ఇక ఇదే సమయంలో గురువారం ఉదయం గుండెపోటుతో మురళి కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోను పరిశీలించినట్లు అయితే ఓ ఇద్దరు వ్యక్తులు మందుల కోసం  మెడ్స్ మెడికల్ షాపులోకి వచ్చారు. వారికి కావాల్సిన మందులను మురళి ఇచ్చాడు. ఆ తర్వాత సదరు వ్యక్తులు తీసుకున్న బిల్లింగ్ చేస్తుండగా.. అస్వస్థకు గురయ్యాడు. బిల్లింగ్  చేస్తూనే ఒక వైపు ఒరిగిపోయాడు. అనంతరం పక్కనే ఉన్న గోడకు తగులుతూ నేలపై ఒరిగిపోయాడు.

ఇక వెంటనే గమనించిన తోటి సిబ్బంది అతడికి సపర్యలు చేశారు. ఫిట్స్ వచ్చిందని భావించి.. అతడి చేతిలో ఇనుప వస్తువు పెట్టి..గట్టిగా పట్టుకుని ఉంచాడు. కాసేపటికి మురళి చలనం లేకుండా పడిపోయాడు. స్థానికుల సహయంతో మురళీని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడిని పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో చనిపోయినట్లు వెల్లడించారు. దీంతో మృతుడి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఇక అతడు హర్ట్ ఎటాక్ కు గురికావటం, క్షణాల్లోనే కుప్పకూలి  మరణించడం దుకాణంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాక ఆ దృశ్యాన్ని చూసిన జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆరోగ్యంగా కనిపించిన మనిషి..క్షణాల్లో ఇలా విగతజీవిగా మారడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి