iDreamPost

ఈ వారం – 6 సినిమాల యుద్ధం

ఈ వారం – 6 సినిమాల యుద్ధం

లైగర్ డిజాస్టర్ ఏ స్థాయిలో నష్టాలు మిగులుస్తుందో ఇంకా తేలాలి కానీ మొన్నటి నుంచే థియేటర్ల ఆక్యుపెన్సీ బాగా డ్రాప్ అయిపోవడం ట్రేడ్ ని నిరాశలో ముంచెత్తింది. ముఖ్యంగా సౌత్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను ఆచార్య తర్వాత మరోసారి దాన్ని మించిన షాక్ తినక తప్పడం లేదు. కనీసం ఫ్యాన్స్ ని సైతం మెప్పించలేకపోవడంతో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఆపేశాడు. ఇదిలా ఉండగా ఈ వారం కొత్త సినిమాల కోసం బాక్సాఫీసు తో పాటు మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా అరడజను తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు ఒక డబ్బింగ్ మూవీ పండగ కానుకలుగా రాబోతున్నాయి.

ఉప్పెనతో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత కొండపొలం డిజాస్టర్ పెద్ద బ్రేక్ వేసింది. అందుకే మూడోది ”రంగ రంగ వైభవంగా’ కోసం రిస్క్ చేయకుండా ఎంటర్ టైన్మెంట్ టెంప్లేట్ లోకి వెళ్ళిపోయాడు. ట్రైలర్ చూశాక కొంత రొటీన్ గానే ఉందనే అభిప్రాయం వచ్చినప్పటికీ కామెడీ కనక వర్కౌట్ అయితే ఈజీగా గట్టెక్కొచ్చు. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా మొదటి రోజు టికెట్లను పొందడమే హీరో లక్ష్యంగా రోపొందిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’కు ప్రమోషన్లు జోరుగా జరుగుతున్నాయి. జాతిరత్నాలు అనుదీప్ కథ మాటలు రాసిన ఈ కామెడీ మూవీకి ఏళ్లుగా పబ్లిసిటీ బాగానే చేస్తున్నారు. మరి అందరి అభిమానులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి

ధనరాజ్ సునీల్ ల కాంబో సీరియస్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ‘బుజ్జి ఇలా రా’ని అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమయింది. ప్రముఖ హాస్య దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి దీనికి కథనందించడం విశేషం. పెద్ద అంచనాలేం లేవు. వీటితో పాటు ఆకాశ వీధుల్లో, డైహార్డ్ ఫ్యాన్, నా వెంటపడుతున్న చిన్నవాడెవరమ్మాలు జీరో బజ్ తో బరిలో దిగుతున్నాయి. ఏదో అద్భుతం జరిగే టాక్ వస్తే తప్ప వీటికి టికెట్లు తెగడం కష్టం. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ని స్పెషల్ వెర్షన్ ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఎలాగూ ఆగస్ట్ 31న విక్రమ్ కోబ్రా వచ్చేసి ఉంటుంది. మొత్తానికి నెంబర్ పెద్దగానే ఉంది కానీ వీటిలో పబ్లిక్ టాక్ తో నెగ్గుకొచ్చేవి ఏవో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి