iDreamPost
android-app
ios-app

ఈ స్టార్ అక్కడ ఖాళీ..  ఇక్కడ చాలా కాస్ట్లీ!

  • Published Jul 25, 2024 | 6:32 PM Updated Updated Jul 25, 2024 | 6:32 PM

ఓ స్టార్ యాక్టర్ తన సొంత బాషలో ఖాళీగా ఉంటున్నాడు. కానీ సౌత్ ఇండియాలో మాత్రం తెగ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ మూవీలో చూసినా విలన్ గా ఒకటే పేరు వినిపిస్తోంది. దాంతో అక్కడ ఖాళీ.. ఇక్కడ కాస్ట్లీ అంటున్నారు మూవీ లవర్స్.

ఓ స్టార్ యాక్టర్ తన సొంత బాషలో ఖాళీగా ఉంటున్నాడు. కానీ సౌత్ ఇండియాలో మాత్రం తెగ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ మూవీలో చూసినా విలన్ గా ఒకటే పేరు వినిపిస్తోంది. దాంతో అక్కడ ఖాళీ.. ఇక్కడ కాస్ట్లీ అంటున్నారు మూవీ లవర్స్.

  • Published Jul 25, 2024 | 6:32 PMUpdated Jul 25, 2024 | 6:32 PM
ఈ స్టార్ అక్కడ ఖాళీ..  ఇక్కడ చాలా కాస్ట్లీ!

ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలు తెరకెక్కించే తీరు పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోలతో పాటుగా చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా చిత్రాలను తీస్తూ దూసుకెళ్తున్నారు. అయితే ఇందుకోసం వివిధ బాషల్లో క్రేజ్ ఉన్న నటీ, నటులను తీసుకుంటున్నారు. దాంతో వారికి చేతినిండా సినిమాలు ఉంటున్నాయి. తాజాగా ఓ స్టార్ యాక్టర్ తన సొంత బాషలో ఖాళీగా ఉంటున్నాడు. కానీ సౌత్ ఇండియాలో మాత్రం తెగ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ మూవీలో చూసినా విలన్ గా ఒకటే పేరు వినిపిస్తోంది. దాంతో అక్కడ ఖాళీ.. ఇక్కడ కాస్ట్లీ అంటున్నారు సినీ లవర్స్. అతడే బాబీ డియోల్..

బాబీ డియోల్.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ నోట విన్నా ఇతడి పేరే వినిపిస్తోంది. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ లో బాబీని పూర్తిగా పక్కనపెట్టేశారు. కానీ.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన ‘యానిమల్’ మూవీలో విలన్ పాత్ర ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో బాబీ పేరు మారుమోగిపోయింది. ఈ మూవీతో అతడికి పూర్వ వైభవం వచ్చిందనే చెప్పాలి. వరుసగా అవకాశాలు అతడి ముందు క్యూ కడుతున్నాయి. సౌత్ సినిమాల్లో ఇప్పుడు బాబీ డియోల్ ఓ హాట్ కేక్.

పవన్ కళ్యాణ్-జాగర్లమూడి క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీలో బాబీ ఔరంగజేబ్ పాత్ర పోషిస్తున్నాడు. సూర్య ‘కంగువ’, బాలకృష్ణ-బాబీ మూవీలో విలన్ గా, ఎన్టీఆర్ దేవరలో కూడా బాబీని విలన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తున్న RC 16లో కూడా విలన్ పాత్రకు బాబీ డియోల్ ను సంప్రదించినట్లు సమాచారం. ఇవే కాకుండా.. మరో రెండు, మూడు సినిమాల్లో నటించమని అడగ్గా.. డేట్లు ఖాళీగా లేవని చెప్పేశాడట. ఒక సందర్భంలో బాలీవుడ్ లో సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉన్న డియోల్ కు పాన్ ఇండియా సినిమాల పుణ్యాన వరుసగా ఛాన్స్ లు లభిస్తున్నాయి. ఇక ఈ స్టార్ యాక్టర్ ఒక్కో సినిమాకు రూ. 4 నుంచి 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రేంజ్ పారితోషికం అంటే చిన్న విషయం కాదు. ఇక ఈ విషయం తెలిసిన మూవీ లవర్స్ బాబీ డియోల్ అక్కడ ఖాళీ.. ఇక్కడ కాస్ట్లీ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.  మరి పాన్ ఇండియా మూవీల్లో అవకాశాలు దక్కించుకుంటూ.. దుమ్మురేపుతున్న బాబీ డియోల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Bobby Deol (@iambobbydeol)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş