iDreamPost
android-app
ios-app

గొప్ప మనసు చాటుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్!

  • Published Jul 25, 2024 | 6:50 PM Updated Updated Jul 25, 2024 | 6:50 PM

తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీకి అడుగు పెట్టి నేటితో పదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఈ హీరో ఓ గొప్ప పని చేసి తన మంచి మనసును చాటుకున్నాడు. కాగా, ప్రస్తుతం ఈ ఫోటోస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీకి అడుగు పెట్టి నేటితో పదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఈ హీరో ఓ గొప్ప పని చేసి తన మంచి మనసును చాటుకున్నాడు. కాగా, ప్రస్తుతం ఈ ఫోటోస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Published Jul 25, 2024 | 6:50 PMUpdated Jul 25, 2024 | 6:50 PM
గొప్ప మనసు చాటుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్!

బెల్లంకొండ ‘సాయి శ్రీనివాస్’.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే.. ఈయన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా తెలుగులో హీరోగా పరిచయమైయ్యాడు. ఈ క్రమంలోనే.. మొదట వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శరీనివాస్. ఇక మొదటి సినిమాతోనే ఈ యంగ్ హీరో మంచి హిట్ ను అందుకోవడమే కాకుండా.. తన నటనతో, డ్యాన్స్ లతో అందర్నీ ఆకట్టుకున్నాడు.

ఇక ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక,సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్ సినిమాల్లో అలరిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో పాటు హిందీలో (ఛత్రపతి) సినిమాలో నటించి క్రేజీ హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమాల్లో రాక్షసుడు, జయ జానకి నాయక సినిమాలు మంచి ఫేమ్ ను తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ యంగ్ హీరో ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఓ గొప్ప పని చేసి తన మంచి మనసు చాటుకున్నాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీకి అడుగు పెట్టి గురువారం (జులై 25) తో పదేళ్లు పూర్తయ్యింది.  అయితే ఈయన మొదటిగా 2014 జులై 24న బెల్లం కొండ శ్రీనివాస్ ఫస్ట్ మూవీ అల్లుడు శ్రీను రిలీజైంది.  దీంతో ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు పూర్తవ్వడతో.. ఓ గొప్ప పనిచేసి తన మంచి మనసును చాటుకున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా ఈ యంగ్ హీరో అంధులకు ఆహారం, బట్టలు పంపిణీ చేశాడు. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు సాయి శ్రీనివాస్. అంతేకాకుండా.. ఆ ఫోటోల  కిందఈ విధంగా రాసుకొచ్చాడు. ‘తాను సినీ ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్లలో ఎన్నో జ్ఞాపకాలను అందించింది. ఇక నా సినిమాలను ఆదరించిన అభిమానులు, ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే నా సినిమాలు  జయాపజయాలతో సంబంధం లేకుండా అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.

ఇలా వారి సహకారమే ఎప్పుడూ నన్ను నిలబడేలా చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. అందుకే నాకెంతో ఇచ్చిన ఈ సమాజానికి ఇలాంటి అద్భుతమైన రోజున ఏదైనా తిరిగి ఇవ్వాలనిపించింది. ఈ క్రమంలోనే ఈ  ఆనందాన్నిఇలా పంచుకుంటున్నాను. మీ దీవెనలు, సహకారం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ తన ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం  ఈ ఫోటోస్ కాస్త వైరల్ గా మారాయి. అయితే ఈ పోస్టు చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ ఈ హీరో మంచి మనసు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి, సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా చేసిన మంచి పని పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/