iDreamPost
android-app
ios-app

ఫస్ట్ మూవీ రిలీజ్​కు ముందే రవితేజ హీరోయిన్​కు జాక్​పాట్.. నక్క తోక తొక్కిందిగా!

  • Published Jul 25, 2024 | 7:59 PM Updated Updated Jul 25, 2024 | 7:59 PM

Bhagyashri Borse: సినీ పరిశ్రమలో నెగ్గుకు రావాలంటే టాలెంట్​తో పాటు లక్ ఫ్యాక్టర్ కూడా తోడవ్వాలి. అప్పుడే క్రేజ్ దక్కడంతో పాటు అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయని నిపుణులు చెబుతుంటారు.

Bhagyashri Borse: సినీ పరిశ్రమలో నెగ్గుకు రావాలంటే టాలెంట్​తో పాటు లక్ ఫ్యాక్టర్ కూడా తోడవ్వాలి. అప్పుడే క్రేజ్ దక్కడంతో పాటు అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయని నిపుణులు చెబుతుంటారు.

  • Published Jul 25, 2024 | 7:59 PMUpdated Jul 25, 2024 | 7:59 PM
ఫస్ట్ మూవీ రిలీజ్​కు ముందే రవితేజ హీరోయిన్​కు జాక్​పాట్.. నక్క తోక తొక్కిందిగా!

ఫిల్మ్ ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. కాస్త లక్ కూడా తోడైతేనే ఫేట్ మారుతుంది. కొందరికి ఎంత ప్రతిభ ఉన్నా అదృష్టం కలసిరాక కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్లే ఉంటుంది. అదే మరికొందరి విషయంలో అటు టాలెంట్, ఇటు లక్ ఫ్యాక్టర్ రెండూ జోడవడంతో కెరీర్ రయ్​మని పరుగులు పెడుతూ ఉంటుంది. చూస్తుండగానే ఫుల్ బిజీ అయిపోతారు. మాస్ మహారాజా రవితేజ సరసన నటించిన ఓ హీరోయిన్ విషయంలోనూ ఇప్పుడు ఇదే జరుగుతోంది. తెలుగులో ఆమె యాక్ట్ చేసిన మొదటి సినిమా ఇంకా విడుదల కాలేదు. అప్పుడే వరుస ఆఫర్లు క్యూ కడుతుండటం చర్చనీయాంశంగా మారింది.

‘మిస్టర్ బచ్చన్’ మూవీతో ఆడియెన్స్​ ఎంటర్​టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు రవితేజ. డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం పంద్రాగస్టుకు విడుదలవడం దాదాపుగా ఖాయంగా మారింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయిందని, రిలీజ్​కు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో మాస్ మహారాజా సరసన హీరోయిన్​గా యాక్ట్ చేశారు భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్స్​లో ఆమె బాగా హైలైట్ అయ్యారు. మూవీ మేకింగ్ స్టేజ్​లో ఉన్నప్పుడే ఈ బ్యూటీ లుక్స్ గురించి చర్చ జరిగింది. మరో హైలైట్ ఏంటంటే.. ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్​కు ముందే భాగ్యశ్రీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఆమె ఆల్రెడీ తెలుగులో రెండు సినిమాలను ఓకే చేశారని సమాచారం.

‘మిస్టర్ బచ్చన్’ నుంచి ఒక్కో ప్రోమో బయటకు వస్తున్న కొద్దీ భాగ్యశ్రీ క్రేజ్ మరింత పెరుగుతోంది. ఆమె అందం, లుక్స్​కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ టైమ్​లో ఓ క్రేజీ ప్రాజెక్ట్​లో భాగ్యశ్రీ ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. యంగ్ హీరో విజయ్ దేవరకొండతో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఫిల్మ్​లో ఆమెను హీరోయిన్​గా ఎంచుకున్నారట. ఈ పాత్ర కోసం ముందు శ్రీలీలను అనుకున్నారట. అయితే ఆమె తప్పుకోవడంతో భాగ్యశ్రీని రీప్లేస్ చేస్తున్నారని టాలీవుడ్ సర్కిల్స్​లో వినిపిస్తోంది. ఈ విషయాన్ని త్వరలో అఫీషియల్​గా అనౌన్స్ చేస్తారని సమాచారం. ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్.. రవితేజ హీరోయిన్ నక్క తోక తొక్కిందని అంటున్నారు. మంచి జాక్​పాట్ కొట్టేసిందని చెబుతున్నారు. మరి.. విజయ్ సరసన భాగ్యశ్రీ నటిస్తే చూడాలని మీరు కోరుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/