Robin Uthappa: వాళ్లిద్దరు ఆడుతుంటే సచిన్-గంగూలీ గుర్తుకు వస్తారు: రాబిన్ ఊతప్ప

ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ఆ ఓపెనింగ్ జోడీ ఆడుతుంటే నాకు సచిన్-గంగూలీ గుర్తుకు వస్తారు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప.

ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ఆ ఓపెనింగ్ జోడీ ఆడుతుంటే నాకు సచిన్-గంగూలీ గుర్తుకు వస్తారు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప.

ప్రపంచ క్రికెట్ లో ఎన్నో ఓపెనింగ్ జోడీలు ఉన్నాయి. కానీ వారందరిలోకి ఒకప్పటి టీమిండియా ఓపెనింగ్ జోడీ సౌరవ్ గంగూలీ-సచిన్ టెండుల్కర్ ది ప్రత్యేక స్థానం. ఈ జోడీ ఆడుతుంటే చూడ్డానికి రెండు కళ్లు సరిపోయేవి కాదు. అంతలా వరల్డ్ క్రికెట్ పై తమదైన ముద్ర వేసుకున్నారు. ఇక ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ఆ ఓపెనింగ్ జోడీ ఆడుతుంటే నాకు సచిన్-గంగూలీ గుర్తుకు వస్తారు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప. మరి ఆ జోడీ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో ఈ జోడీ ఓపెనింగ్ చేసిన విషయం తెలిసిందే. టీ20లకు ఈ దిగ్గజ క్రికెటర్లు వీడ్కోలు పలికిన తర్వాత శుబ్ మన్ గిల్-యశస్వీ జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్నారు. ఇటీవల జింబాబ్వేతో ముగిసిన టీ20 సిరీస్ లో కూడా ఈ జోడీనే ఇన్నింగ్స్ ప్రారంభించింది. తాజాగా శ్రీలంకతో ముగిసిన సిరీస్ లో కూడా వీరే ఓపెనర్లుగా బరిలోకి దిగి సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఈ జోడీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు రాబిన్ ఊతప్ప.

సోనీ స్పోర్ట్స్ తో రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ..”శుబ్ మన్ గిల్-యశస్వీ జైస్వాల్ జోడీ ఆడుతుంటే నాకు సచిన్ టెండుల్కర్-సౌరవ్ గంగూలీ గుర్తుకు వస్తారు. అప్పట్లో ఈ దిగ్గజాలు ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని ఎలా ఆడారో.. ఇప్పుడు అచ్చం అలాగే గిల్-జైస్వాల్ ఆడుతున్నారు. తమ వ్యూహాలను అమలు చేస్తూనే.. బౌలర్లపై ఎదురుదాడికి దిగుతుంటారు. ఇప్పటికే జైస్వాల్ టెస్టు, టీ20ల్లో స్థానం సంపాదించుకోగా.. త్వరలోనే వన్డేల్లో కూడా ఓపెనింగ్ చేస్తాడు” అంటూ ఊతప్ప ప్రశంసలు కురిపించాడు. ఇక్కడ మరో విషయం గమనించాలి. గంగూలీ లాగే జైస్వాల్ లెఫ్ట్ హ్యాండర్ కాగా.. సచిన్ లా గిల్ రైట్ హ్యాండర్ బ్యాటర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఊతప్ప పోలికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments