iDreamPost
android-app
ios-app

Arjun Tendulkar: ట్రోలర్స్ కి దిమ్మతిరిగే షాక్.. సంచలనం సృష్టించిన సచిన్ టెండూల్కర్ కొడుకు!

  • Published Nov 13, 2024 | 5:24 PM Updated Updated Nov 13, 2024 | 5:24 PM

Arjun Tendulkar: సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ తనని ట్రోల్ చేసిన వారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చాడు. తాజా ఆటతో అందరి నోళ్ళు మూయించాడు.

Arjun Tendulkar: సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ తనని ట్రోల్ చేసిన వారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చాడు. తాజా ఆటతో అందరి నోళ్ళు మూయించాడు.

Arjun Tendulkar: ట్రోలర్స్ కి దిమ్మతిరిగే షాక్.. సంచలనం సృష్టించిన సచిన్ టెండూల్కర్ కొడుకు!

సచిన్.. క్రికెట్ కి గాడ్.. ఆయన రికార్డులు అనితర సాధ్యం.. క్రికెట్ ప్రపంచంలో ఎంత గొప్ప క్రికెటర్లు వచ్చినా సచిన్ రికార్డులు అందుకోలేరు. అలాంటి లెజెండ్ వారసుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్ లోకి వస్తున్నాడు అనే వార్త రాగానే అభిమానులు ఉప్పొంగిపోయారు. క్రికెట్ గాడ్ కొడుకు ఆట కోసం పరితపించారు. కనీ వినీ ఎరుగని రీతిలో అర్జున్ టెండూల్కర్ పై అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆ అంచనాల మొత్తాన్ని నీరు గార్చాడు అర్జున్. ఒకటి రెండు మ్యాచ్ ల్లో తప్ప మిగిలిన మ్యాచ్ ల్లో ఘోరంగా విఫలం అయ్యాడు అర్జున్. IPL టైమ్ లో అర్జున్ ని ఘోరాతి ఘోరంగా ట్రోల్ చేశారు. ఇతను క్రికెట్ కి పనికి రాడని కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో అర్జున్ ని గేలి చేయని వారే లేరు. ఐపీఎల్‌లో ఒకప్పుడు తన తండ్రికి రెడ్ కార్పెట్ వేసిన ముంబై ఇండియన్స్ అర్జున్ ని టీం నుంచి పొమ్మంది.

ఇన్ని అవమానాలు ఇన్ని ట్రోల్స్ ఫేస్ చేసిన అర్జున్ ఏమాత్రం క్రుంగి పోలేదు. కింద పడ్డాడు. లేచి నిలబడ్డాడు. అన్నిటికీ టైమ్ వస్తుందని అవమానాలను లైట్ తీసుకున్నాడు. మళ్ళీ తన గేమ్ ని రీస్టార్ట్ చేశాడు. కష్టపడ్డాడు. కట్ చేస్తే.. ఆ టైమ్ రానే వచ్చేసింది. తాజాగా 5 వికెట్లతో రచ్చ రంబోలా చేశాడు. అతన్ని ట్రోల్ చేసిన వారే శభాష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సింహం బిడ్డ రెండడుగులు వెనక్కి వేసి మళ్ళీ ముందుకు దూకింది అంటున్నారు. అలా మళ్ళీ సంచలనం అయ్యాడు మన అర్జునుడు. రంజీ ట్రోఫీలో గోవా తరఫున ఆడుతున్నాడు అర్జున్ టెండూల్కర్. అరుణాచల్ ప్రదేశ్‌పై జరిగిన మ్యాచ్ లో 9 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఫర్ ది ఫస్ట్ టైమ్ ఈ టోర్నీలో 5 వికెట్లు తీసిన ఘనత అర్జున్ టెండూల్కర్‌కు దక్కింది. తన అద్భుతమైన బౌలింగ్‌ కారణంగా అరుణాచల్ ప్రదేశ్ కేవలం 84 పరుగులకే కుప్ప కూలింది.

అసలు ఏ బ్యాట్స్‌మెన్‌ కూడా నిలదొక్కుకోలేని విధంగా అర్జున్ టెండూల్కర్ విధ్వంసం సృష్టించాడు. రెండో ఓవర్‌లోనే అరుణాచల్ ప్రదేశ్ ఓపెనర్ నీబామ్ హచాంగ్‌ను బౌల్డ్ చేశాడు. కొంత టైమ్ తర్వాత, మళ్లీ నీలమ్ ఓబీని బోల్డ్ చేశాడు. ఇక ఆ తర్వాత జై భావ్‌సర్‌ను ఎల్‌బీడబ్ల్యూ చేశాడు. దీని తర్వాత చిన్మయ్ పాటిల్‌కి క్యాచ్ ఇచ్చి మోజీ అటే బౌలింగ్‌లో 5వ వికెట్‌ను అందుకున్నాడు అర్జున్. ఈ విధంగా కేవలం 36 పరుగుల వద్ద ఫస్ట్ 5 బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేసి అరుణాచల్ ప్రదేశ్ జట్టుని కుప్పకూల్చాడు మన అర్జునుడు. తన అద్భుతమైన ఆటతో గోవాకు నమ్మకమైన బౌలర్‌గా నిలిచాడు. విలువైన ఆటగాడిగా మారాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అర్జున్ 16 మ్యాచ్‌లు ఆడి 32 వికెట్లు తీశాడు. సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు. అర్జున్ తాజా పర్ఫామెన్స్ తో సచిన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అర్జున్ ఇలానే కొనసాగితే కచ్చితంగా తండ్రికి తగ్గ తనయుడు అవుతాడాని కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ సంగతి. ఇక అర్జున్ టెండూల్కర్ తాజా ఆట గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.