iDreamPost
android-app
ios-app

ముచ్చటగా మూడు వరల్డ్‌ రికార్డులు బ్రేక్‌ చేసిన రోహిత్‌ సేన!

  • Published Sep 30, 2024 | 5:52 PM Updated Updated Sep 30, 2024 | 5:52 PM

IND vs BAN, Rohit Sharma, Virat Kohli, Yashasvi Jaiswal, KL Rahul: ఇండియా విధ్వంసం సృష్టించి.. మూడు వరల్డ్‌ రికార్డులు నెలకొల్పింది. టెస్టుల్లో టీ20 బ్యాటింగ్‌తో ఈ అద్భుతం చేసింది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

IND vs BAN, Rohit Sharma, Virat Kohli, Yashasvi Jaiswal, KL Rahul: ఇండియా విధ్వంసం సృష్టించి.. మూడు వరల్డ్‌ రికార్డులు నెలకొల్పింది. టెస్టుల్లో టీ20 బ్యాటింగ్‌తో ఈ అద్భుతం చేసింది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Sep 30, 2024 | 5:52 PMUpdated Sep 30, 2024 | 5:52 PM
ముచ్చటగా మూడు వరల్డ్‌ రికార్డులు బ్రేక్‌ చేసిన రోహిత్‌ సేన!

విధ్వంసం.. క్రికెట్‌ లోకం ఏ మాత్రం ఊహించని విధంగా టీమిండియా విధ్వంస సృష్టించింది. ఇంతవరకు టెస్టుల్లో ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ క్రికెట్‌ను చూసిన వారికి.. బజ్‌బాల్‌ అమ్మమొగుడి క్రికెట్‌తో బంగ్లాదేశ్‌ను దడదడలాడించింది రోహిత్‌ సేన. బంగ్లా బౌలర్లను ఊచకోత కోస్తూ.. టెస్ట్‌ మ్యాచ్‌లో టీ20ని మించిన హిట్టింగ్‌ చేవారు. రోహిత్‌ శర్మ, జైస్వాల్‌, గిల్‌, కోహ్లీ, పంత్‌, కేఎల్‌ రాహుల్‌.. ఇలా క్రీజ్‌లోకి వచ్చిన ప్రతి ఒక్కరు బాదడమే పనిగా పెట్టుకున్నారు. వీరి విధ్వంసకర బ్యాటింగ్‌తో టీమిండియా ఏకంగా వరల్డ్‌ రికార్డులు బద్దలు కొట్టింది. టెస్టుల్లో అత్యంత వేగంగా 50, 100, 150 పరుగులు చేసి తొలి జట్టుగా రోహిత్‌ సేన కొత్త చరిత్ర లిఖించింది.

బంగ్లాదేశ్‌తో కాన్పూర్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ నాలుగో రోజు ఆటలో ఈ భీకర బ్యాటింగ్‌ జరిగింది. సెప్టెంబర్‌ 27న ప్రారంభమైన మ్యాచ్‌కు తొలి రోజు నుంచే వర్షం అంతరాయం కలిగించింది. ఫస్ట్‌ డే కేవలం 35 ఓవర్లల ఆట మాత్రమే సాగింది. అందులో బంగ్లాదేశ్‌ 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. తర్వాత రెండు రోజుల వర్షం కారణం ఆట జరగలేదు. అరెరె.. మ్యాచ్‌ డ్రాగా ముగిసేలా ఉందే.. ఇలా అయితే.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ రేసులో టీమిండియాకు నష్టం జరిగే ప్రమాదం ఉందని భారత క్రికెట్‌ అభిమానులు కాస్త బాధపడ్డారు. అయితే.. నాలుగో రోజు ఆట ప్రారంభం అయింది. ఎలాగో రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఇక మ్యాచ్‌ కచ్చితంగా డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు. కానీ, రోహిత్‌ శర్మ అనే మాస్టర్‌ మైండ్‌ వేరేలా ఆలోచించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 233 పరుగులకు ఆలౌట్‌ అయిపోయింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ కోసం బరిలోకి దిగింది. అయితే.. టెస్ట్‌ ఆడేందుకు కాదు.. టీ20 మ్యాచ్‌ ఆడేందుకు అన్నట్లు ఓపెనర్లు జైస్వాల్‌, రోహిత్‌ శర్మ రెచ్చిపోయారు. ఫోర్లు, సిక్సులతో బంగ్లా బౌలర్లకు చెడుగుడు ఆడుకున్నారు. అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు.. వీళ్లు టెస్ట్‌ ఆడుతున్నారా? టీ20 ఆడుతున్నారా? అంటూ బంగ్లా ప్లేయర్లు కూడా షాక్‌ అయ్యారు. జైస్వాల్‌ 51 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులతో 72, రోహిత్‌ శర్మ 11 బంతుల్లో 1 ఫోర్లు, 3 సిక్సులతో 23 పరుగులు చేసి తొలి వికెట్‌కు కేవలం 3.5 ఓవర్లలో 55 పరుగులు జోడించారు. రోహిత్‌ అవుట్‌ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన గిల్‌ సైతం 36 బంతుల్లో 39 పరుగులు చేశారు.

జైస్వాల్‌ అవుట్‌ అయ్యాక.. కోహ్లీ కంటే పంత్‌ ముందు బ్యాటింగ్‌కి వచ్చాడు. ఎందుకంటే.. అగ్రెసివ్‌ బ్యాటింగ్‌ కోసం కానీ, 9 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. తర్వాత కోహ్లీ వచ్చి రావడంతోనే బంగ్లాపై విరుచుకుపడ్డాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 47 పరుగులు చేశాడు. అలాగే కేఎల్‌ రాహుల్‌ సైతం 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 68 పరుగులు చేశాడు. ఇలా ప్రధాన బ్యాటర్లంతా హిట్టింగ్‌కి ప్రియారిటీ ఇవ్వడంతో టీమిండియా టెస్టుల్లో అత్యంత వేగంగా 50, 100, 150 పరుగులు చేసి టీమ్‌ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. చివరికి బౌలర్‌ ఆకాశ్‌ దీప్‌ సైతం రెండు వరుస బంతుల్లో రెండు భారీ సిక్సులు బాదాడం విశేషం. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా సాధించిన ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.